బాహబలి ప్రభాస్ అంటే ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఊగిపోతారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోల్లో ప్రభాస్ ఒకడు.
అలాంటి ప్రభాస్ గత కొద్ది కాలంగా తన కాలి నొప్పి కారణంగా తన ఫిజిక్ మీద, వ్యాయామం మీద దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో శరీరాకృతి కాస్త మారింది. ప్రభాస్ ను అభిమానించే వారందరినీ ఇది కాస్త కలవరపెట్టిన మాట వాస్తవం.
అయితే నిన్నటికి నిన్న జరిగిన సీతారాం సినిమా ఫంక్షన్ ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. కాస్త గ్యాప్ తరువాత ప్రభాస్ ఇదే బయటకు రావడం. ఎలా వుంటాడో అని అందరికీ ఎంతో ఆసక్తి. ఆతృత. అలాంటి నేపథ్యంలో మళ్లీ పాత ప్రభాస్ దర్శనమిచ్చారు. పెర్ ఫెక్ట్ ఫిజిక్ తో, లుక్స్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు.
దాంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో పండగ చేసేసుకున్నారు. డార్లింగ్ బ్యాక్..అంటూ హల్ చల్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సమాంతరంగా నిర్మాణంలో వున్నాయి. వీటిలో రెండు సినిమాలు 2023లో విడుదలవుతాయి.