Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్ మరో రెండు సినిమాలు

ప్రభాస్ మరో రెండు సినిమాలు

రాధేశ్యామ్..సలార్..ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె..స్పిరిట్..ఇవన్నీ రావాల్సిన సినిమాలే. అన్నీ బాహుబలి ఫ్రభాస్ ఓకె చేసినవి, షూట్ చేసినవి, చేస్తున్నవి, చేయాల్సినవీ. 

ఇవి కాక ఇప్పడు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న మైత్రీ మూవీస్ కమిట్ మెంట్ ప్రకారం, వార్ మూవీ డైరక్టర్ సిద్దార్ధ ఆనంద్ తో మల్టీస్టారర్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు వార్తలు గతంలో కూడా వినిపించాయి.  

ఇప్పుడు దాదాపు అన్ని వైపుల నుంచి అన్ని విధాల ఓకె అయినట్లు బోగట్టా. ఇదిలా వుంటే మరో సినిమా కూడా ప్రభాస్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే, ఆ గ్యాప్ లో మరో తెలుగు నిర్మాతకు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి మిగిలిన విషయాలు అన్నీ ఇంకా ఫైనల్ కావాల్సి వుంది. 

ఇది కూడా ఓకె అయితే మొత్తం 7 సినిమాలు వుంటాయి లైన్లో., ఇవన్నీ కాక నిర్మాత దిల్ రాజుకు కమిట్ మెంట్ వుండనే వుంది. అది కూడా లెక్కలో వేసుకుంటే ఎనిమిది సినిమాలు. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసినా, 2025 వరకు సినిమాలు వున్నట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?