అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న ప్రభాస్

రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. ఇలా దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన తన…

రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. ఇలా దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన తన అభిమానుల కుటుంబాల్ని ప్రభాస్ ఆదుకుంటున్నాడు. ఇందులో భాగంగా గుంటూరు ఘటనలో చనిపోయిన అభిమాని కుటుంబాన్ని ప్రభాస్ ఆదుకున్నాడు.

రాధేశ్యామ్ రిలీజ్ కోసం గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఉన్న పల్నాడు ఐనాక్స్ లో బ్యానర్ కట్టడానికి ప్రయత్నించి ఓ అభిమాని ప్రమాదవశాత్తూ మరణించాడు. అతడ్ని చల్లా కోటేశ్వరావుగా గుర్తించారు. అతడు చాలా ఏళ్లుగా ప్రభాస్ అభిమాని. ప్రతి సినిమా రిలీజ్ ను అతడు సెలబ్రేట్ చేస్తాడట.

కోటేశ్వరరావు మరణవార్త ప్రభాస్ వరకు వెళ్లింది. దీంతో అతడు తన టీమ్ కు చెప్పి, కోటేశ్వరరావు భార్య ఎకౌంట్లో 2 లక్షలు నష్టపరిహారంగా డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్ ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ చేసి ధైర్యం కూడా చెప్పారట. ఇతర చోట్ల ఇదే విధంగా రిలీజ్ సందర్భంగా మరణించిన అభిమానుల కుటుంబాల్ని కూడా ప్రభాస్ ఆదుకుంటాడని అతడి టీమ్ చెబుతోంది.

రాధేశ్యామ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గిపోయాయి. నిన్న సోమవారం ఈ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ పడిపోయింది. సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 3 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా తన 4 రోజుల రన్ తో తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ సాధించింది.