అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రభాస్ వెయిట్ ఇష్యూస్, ఆదిపురుష్ సినిమాపై పడ్డాయి. దర్శకుడు ఓం రౌత్ అనుకున్న ఫిజిక్ ను ప్రభాస్ సాధించలేకపోయాడు. దీంతో అతడికి ఫుల్ బాడీ టెస్ట్ చేయాలని యూనిట్ నిర్ణయించిందట. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ పాటు, ప్రభాస్ ను బ్రిటన్ పంపించాలని యూనిట్ అనుకుంటోందట.
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ పాత్ర కోసం బాగానే సిద్ధమయ్యాడు కూడా. అయితే అంతలోనే లాక్ డౌన్ పడడం, షూటింగ్ ఆగడం, ప్రభాస్ మళ్లీ లావెక్కడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గినప్పటికీ సలార్ షూట్ టైమ్ లో తిరిగి బరువు పెరిగాడట ఈ హీరో.
ఇలా ప్రభాస్ బరువు పెరిగి, తగ్గడంపై ఆందోళన వ్యక్తంచేస్తోంది ఆదిపురుష్ యూనిట్. ఫిజిక్ లో తేడాలు సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే బ్రిటన్ లో వరల్డ్ క్లాస్ డైటీషియన్ల ఆధ్వర్యంలో ప్రభాస్ కు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ చేయించి, అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటోందట. ఈ మేరకు త్వరలోనే బ్రిటన్ వెళ్లబోతున్నాడట ఈ హీరో. అయితే ఈ మేటర్ పై యూనిట్ పెదవి విప్పడం లేదు.
సాహో సినిమా నుంచి తన లుక్, ఫిజిక్ కు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నాడు ప్రభాస్. ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రభాస్ లుక్ కూడా ఓ కారణం అంటారు చాలామంది. ఇప్పుడు మళ్లీ అదే సమస్య రిపీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్ మంచి భోజన ప్రియుడనే సంగతి అందరికీ తెలిసిందే.