అదిగో సినిమా..ఇదిగో 10 న పూజ అంటా హడావుడి జరిగిపోయింది ప్రభాస్-మారుతి సినిమాకు. పైగా దర్శకుడు మారుతి అత్యంత సన్నిహితులు కూడా తమ నేస్తాలకు 10న పూజ వుందోచ్ అని చాటింపు వేసారు. కానీ తీరా చేస్తే ఇప్పుడు పూజ లాంటి హడావుడి ఏదీ వున్నట్లు కనిపించడం లేదు.
దీని వెనుక ఆసక్తి కరమైన గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్-మారుతి సినిమాకు లైన్ రెడీనే కానీ బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాలేదన్నది ఓ గ్యాసిప్. ముఖ్యంగా సెకండాఫ్ ఇంకా నెరేషన్ ఇవ్వాల్సి వుందని, దాన్ని లాక్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం దర్శకుడు మారుతి ఓ రైటర్స్ టీమ్ ను హైర్ చేసారని టాక్.
ముఖ్యంగా మారుతి, బన్నీవాస్ కు సన్నిహితుడు వాసూ వర్మ ఈ టీమ్ లో కీలకంగా వున్నారని, వీరంతా ట్రైడెంట్ హోటల్ లో కథపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వాసూ వర్మనే ఇటీవల గీతా అందించిన బ్యాచులర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించారు. వన్స్ ఇది పూర్తయ్యాక, ప్రభాస్ ఓకె చేస్తే డేట్ లు అడ్జస్ట్ చేయాల్సి వుంది.
ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు అన్న సంగతి ఓ హీరోయిన్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బోమైన్ ఇరానీ లేదా పరేష్ రావెల్ ను ఓ కీలకపాత్రకు తీసుకుంటారని వార్తలు వచ్చాయి.