పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తితో ‘జై హనుమాన్’

బ్లాక్ బస్టర్ హిట్టయిన హను-మాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ప్రాజెక్టును ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెల్లడించాడు. Advertisement “హనుమాన్ సినిమాకు సీక్వెల్…

బ్లాక్ బస్టర్ హిట్టయిన హను-మాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ప్రాజెక్టును ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెల్లడించాడు.

“హనుమాన్ సినిమాకు సీక్వెల్ అనుకోలేదు. పార్ట్-2 ఇంపాజిబుల్ అనుకున్నాం. అదే టైమ్ లో హనుమాన్ లో ఆంజనేయస్వామి పాత్ర కోసం ఓ పాన్ ఇండియా స్టార్ ను కలిశాను. కథ చెప్పాను. ఆయన ఓకే చెప్పారు. అయితే పార్ట్-2లో హనుమంతుడ్ని ఎలా చూపించబోతున్నారో చెప్పాలన్నారు. అసలు సీక్వెల్ లేదని చెప్పాను. కచ్చితంగా సీక్వెల్ చేయాలని, కథ రెడీ చేయమని ఆయన ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే సీక్వెల్ సిద్ధం చేశాను.”

ఇలా జై హనుమాన్ ప్రాజెక్టుకు ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. అయితే ఆ స్టార్ పేరు మాత్రం బయటపెట్టలేదు. ఆ స్టార్ ను కలిసిన తర్వాత హైదరాబాద్ వచ్చి జై హనుమాన్ కు కథ రెడీ చేశాడు ప్రశాంత్ వర్మ.

ప్రస్తుతానికి జై హనుమాన్ కు సంబంధించి ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ రెడీగా ఉన్నాయట. మధ్యలో సన్నివేశాలు కొన్ని ఉన్నప్పటికీ, స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతోందని స్పష్టం చేశాడు. జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రలో నటించబోయే పాన్ ఇండియా స్టార్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేస్తామని ప్రకటించాడు.