మొన్నటికిమొన్న హీరోయిన్ అనన్య పాండే ప్రైవేటు ఫొటోలు లీక్ అయ్యాయి. బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్న స్టిల్స్ అవి. ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ప్రేయాయణం బయటపడింది. ఈసారి కంగనా రనౌత్ వంతు.
అవును… కంగనా రనౌత్ ప్రేమలో ఉంది. తను డేటింగ్ లో ఉన్న విషయాన్ని ఈ హీరోయిన్ స్వయంగా బయటపెట్టింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. కంగనా ఇలా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడానికి ఓ రీజన్ ఉంది.
రీసెంట్ గా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరైంది కంగనా రనౌత్. అయితే సింగిల్ గా మాత్రం కాదు. నిషాంత్ పిట్టి అనే వ్యక్తితో కలిసి వచ్చింది. చేతిలో చేయి వేసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కథనాలు మొదలయ్యాయి.
ఇది అసత్య ప్రచారం అంటోంది కంగన. నిషాంత్ కు ఆల్రెడీ పెళ్లయిందని, హ్యాపీగా ఉన్నాడని, తను మాత్రం వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని నిర్థారించింది. ఓ మంచి సమయం చూసి తన ప్రియుడు ఎవరనే విషయాన్ని బయటపెడతానంటోంది.
సో.. కంగనా కూడా డేటింగ్ బ్యాచ్ లోకి చేరిపోయిందన్నమాట. ఇంతకుముందు ఆమె ఓ హెయిర్ స్టయిలిస్ట్ తో, ఓ నటుడితో ఎఫైర్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈసారి నిజంగానే ప్రేమలో ఉన్నట్టు స్వయంగా కంగనా ప్రకటించింది.