Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిన్నతనమే..చేరరమ్మంటే..పండగేగా

ముదిమి మీద పడిన తరువాత ఆనాటి ఆ జ్ఞాపకాలు ఆనందంగా వుంటాయి. వయసు తెచ్చిన పెద్దరికం వద్దు అంటున్న వేళ, మరొక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్లి, ఆ అనుభూతులు చవిచూడాలని అనుకున్న తరుణం చిత్రంగా వుంటుంది. ఇలాంటి వైనాన్ని వర్థించాలంటే 'సిరివెన్నెల' లాంటి కవి కలం చేసుకోవాల్సిందే. 

ప్రతి రోజూ పండగే సినిమా సినిమా థీమ్ నే ఇది. మరో వారంలో మరణిస్తానని తెలిసిన తాత, అలాంటి తాతను నవ్వుతూ జీవితం నుంచి సాగనింపాలి అనుకునే మనవడు. వీరిద్దరి మధ్య ఆ చివరి వారం రోజుల్లో తొంగిచూసిన మధుర స్మృతుల నెమరువేత. ఇవన్నీ అచ్చమైన తెలుగు పాటగా మార్చేసారు సిరివెన్నెల. థమన్ మ్యూజిక్ డైరక్షన్లో విజయ్ జేసుదాస్ పాడారు. 

'చిన్న తనమే చేరరమ్మంటే..ప్రాణం నిన్నవైపే దారి తీస్తోందో..అడుగులైతే ఎదరకైనా, నడక మాత్రం వెనకకే..గడచిపోయిన జ్ఞాపకాలతో గతం ఎదురవుతున్నదే.. చెరిగిపోనేలేదే.. మరపురానే రాదే..చివరి మలుపున నిలచి పిలిచిన స్ముతుల చిటికెన వేలు వదలని చెలిమిగ....''

ఇందుకు కాదా? సిరివెన్నెలే ఈ పాట రాయలని దర్శకుడు మారుతి అనుకున్నది. ప్రాణం వెనక్కు..అడుగులు ముందుకు...అలాగే, వెనక్కు వెళ్తుంటే గతం ఎదురుకావడం, స్ముతుల చిటికెన వేలు వదలకుండా వుండడం, ఎలాంటి భావ వ్యక్తీకరణ ఇది. ఇక్కడ చిటికెన వేలు అనడం వెనుక ఇంకో మర్మం వుంది. మనవడు పట్టుకునేది తాత చిటికెన వేలునే కదా?

'..ఊహలే ఉప్పొంగుతున్నవిరా..ముగియని కథలతో మది మేలుకున్నదిరా..'' జీవితంలో అప్పటి వరకు చేయనివి, చేయాలనుకునీ చేయనివి అన్నీ ఈ చివరి చరమాంకంలో చేయాలని అనుకోవడం అనేదాన్ని ఒక్క అయిదారుపదాల్లో చెప్పేసారు సిరివెన్నెల. 

విజయ్ జేసుదాస్ పాడడం బాగుందిని చెప్పడం అనవసరం. థమన్ మాంచి త్యాగరాజ కృతి శైలి ట్యూన్ అందించారు. ట్యూన్ లో అక్కడక్కడ పాత పాటల శైలి వినిపించడానికి కారణం ఇదే. ఇప్పటి వరకు మాంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పడమే కానీ, వదిలిన ట్రయిలర్ ఫుల్ ఫన్ తో వుంది. ఈ పాట మాత్రం ఆ ఫీల్ ను అందించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?