ప్రేక్షకుల తప్పు లేదు

కరోనా సెకెండ్ ఫేజ్ తరువాత థియేటర్లు ఓపెన్ అయ్యాక తొలి వీకెండ్ గడిచింది. ఈ వీకెండ్ చూస్తే వచ్చిన క్లారిటీ ఒకటే. ప్రేక్షకులు సినిమా చూడడానికి రెడీగా వున్నారు.  Advertisement థియేటర్లలోకి సినిమాలు రావాల్సి…

కరోనా సెకెండ్ ఫేజ్ తరువాత థియేటర్లు ఓపెన్ అయ్యాక తొలి వీకెండ్ గడిచింది. ఈ వీకెండ్ చూస్తే వచ్చిన క్లారిటీ ఒకటే. ప్రేక్షకులు సినిమా చూడడానికి రెడీగా వున్నారు. 

థియేటర్లలోకి సినిమాలు రావాల్సి వుంది అన్నదే ఆ క్లారిటీ. ఈవారం వచ్చిన ఇష్క్, తిమ్మరసు సినిమాలు ఎక్కడ ముందుగా విడుదల అయితే అక్కడ రెస్పాన్స్ బాగానే వచ్చింది. 

అయితే ఇష్క్ అంచనాలను అందుకోకపోవడంతో చతికిలపడింది. తిమ్మరసు ఫరవాలేదు ఓకె అని అనిపించుకోవడంతోనూ, రెండు సినిమాల్లో ఒకటి డౌన్ కావడంతోనూ, దొరికిన థియేటర్ల మేరకు కలెక్షన్లు ఫరవాలేదు అనిపించాయి. చాలా చోట్ల తిమ్మరసు హవుస్ ఫుల్స్ కళ్ల చూసింది అంటే ప్రేక్షకులు రెడీగా వున్నారు అనడానికి రుజువు.

అయితే మాస్ సినిమాలు కోరుకునే సి సెంటర్లలో మాత్రం కలెక్షన్లు అంతగా లేవు. ఇప్పుడు కనుక మాంచి మాస్ యాక్షన్ మూవీ కనుక థియేటర్లోకి వస్తే ఆ ఊపు మామూలుగా వుండదు.  

నిజానికి ఈ జోనర్ కు సెట్ అయ్యే సీటీమార్ సినిమా కాపీ రెడీ గానే వుంది. అలాగే జనాలు పరుగెత్తుకు వచ్చే లవ్ స్టోరీ, టక్ జగదీష్ లాంటి సినిమాలు కూడా రెడీగానే వున్నాయి. కానీ ఎందుకో ఆ ధిశగా ఆలోచించడం లేదు. బహుశా టికెట్ రేట్లే సమస్య కావచ్చు.