Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫృధ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా?

ఫృధ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా?

వినడానికి క్రేజీగా ఉంది కదా, కార్యరూపం దాలిస్తే మరింత క్రేజీగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది ఫాంటసీ మాత్రమే. సలార్ లో స్నేహితులుగా నటించిన వరద, దేవా.. రియల్ లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పృధ్వీరాజ్ హుషారుగా మారిపోతాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు.

ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి దర్శకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కోణంలో అతడికి మీడియా నుంచి ప్రశ్న ఎదురైనప్పుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ నుంచి మంచి కథ తన దగ్గరకొస్తే, అందులో హీరోగా నటిస్తానని తెలిపిన పృధ్వీరాజ్.. తనే తెలుగులో డైరక్ట్ చేయాల్సి వస్తే, ప్రభాస్ హీరోగా సినిమా చేస్తానని ప్రకటించాడు.

మలయాళంలో లూసిఫర్, బ్రో డాడీ లాంటి సినిమాలు తీసింది ఇతడే. వీటిలో లూసిఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. ఇక బ్రో డాడీ సినిమాలో కూడా చిరంజీవి నటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది కార్యరూపం దాల్చలేదు.

గతంలో చిరంజీవి తనకు చాలా అవకాశాలిచ్చారని, కానీ దురదృష్టవశాత్తూ అవేవీ కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చిన పృధ్వీరాజ్, తెలుగులో తను సినిమా డైరక్ట్ చేస్తే తన తొలి ఆప్షన్ ప్రభాస్ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఇక సలార్-2పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపిన పృధ్వీరాజ్.. పార్ట్-1తో పోలిస్తే, పార్ట్-2లో ప్రభాస్ కాస్త ఎక్కువ డైలాగ్స్ చెబుతాడని స్పష్టం చేశాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?