Advertisement

Advertisement


Home > Movies - Movie News

శశికళగా ప్రియమణి !

 శశికళగా ప్రియమణి !

ఒకవైపు 'తలైవి'లో టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ లుక్ పై విమర్శలు వచ్చాయి. జయలలితలా కంగనను చూపించాలనే ప్రయత్నం పై నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కంగనా మంచి నటే కావొచ్చు కానీ, ఆమెలో జయలలిత ఛాయలు ఏ మాత్రం కనిపించలేదని క్రిటిక్స్ కుండబద్ధలు కొట్టారు.

బయోపిక్స్ తీసేటప్పుడు హావభావాల్లో, ఆహార్యంలో నటులు ఒరిజినల్ వ్యక్తులను మురిపించాల్సి  ఉంటుంది. లేదంటే అంతే సంగతి. మొదటికే మోసం వస్తుంది. 

ఇలాంటి నేపథ్యంలో జయలలితగా కంగనా రనౌత్ సెట్ కాలేదనే టాకే వ్యాపిస్తూ ఉంది. ఆ సంగతలా  ఉంటే ఆ సినిమాలో శశికళ పాత్రకు మాత్రం చక్కని ఎంపికనే చేసినట్టుగా ఉన్నారు. జాతీయ అవార్డు పొందిన నటి ప్రియమణిని శశికళ పాత్రలో  చూపించనున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే హీరోయిన్ గా అవకాశాలు లేవు ప్రియమణికి. వయసు రీత్యా కూడా ప్రౌడ పాత్రలకు ప్రియమణి సెట్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రియమణిని మేకప్ తో శశికళలా చూపించడం మేకర్లకు పెద్ద కష్టం కాకపోవచ్చునేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?