
తమ కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న అవమానాలను, లైంగిక వేధింపులను, మితీమిరి ఎక్స్ పోజింగ్ చేయించిన దర్శకులను, హాట్ సీన్లలో శృతిమించి ప్రవర్తించిన హీరోల ప్రస్తావనను హీరోయిన్లు బాగా ఎదిగాకా లేదా కెరీర్ ముగిసిపోయాకా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ జాబితాలో హాలీవుడ్ రేంజ్ లో ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక కూడా చేరింది.
తన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రియాంక తన కెరీర్ బిగినింగ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక సీన్ చిత్రీకరణలో భాగంగా ఒక దర్శకుడు తన అండర్ వేర్ చూపించాల్సిందే అంటూ పట్టుబట్టాడని చెప్పింది.
2002-03 సమయంలో ఒక సినిమా షూటింగులో భాగంగా ఇది జరిగిందని ప్రియాంక వివరించింది. ఆ సీన్ ఒక స్ట్రీమీ సీన్ అని అందులో తను రొమాంటిక్ గా నటించాలని.. ఆ సీన్ లో తన నటన కొనసాగుతుండగా.. కెమెరాకు తన అండర్ వేర్ కనిపించేలా హీరో మీద తను పడిపోవాలన్నట్టుగా ఆ డైరెక్టర్ చెప్పాడని ప్రియాంక వివరించింది.
తను మామూలుగా నటిస్తే.. వీల్లేదన్నడని అండర్ వేర్ చూపించాల్సిందే అన్నాడని ఆమె చెప్పింది. *నాకు అండర్ వేర్ కనిపించాల్సిందే, ఎవరు ఈ సినిమా చూడటానికి వస్తారు ఆమె అలా కనిపించకపోతే..* అంటూ ఆ దర్శకుడు వ్యాఖ్యానించాడని కూడా ప్రియాంక వివరించింది.
ఇలా కెరీర్ బిగినింగ్ డేస్ లో తను ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రియాంక వివరించింది. ఇది వరకూ ఈ తరహాలో చాలా మంది తారలు చెప్పారు. కెరీర్ అర్లీ డేస్ లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేసిన వారు.. అప్పుడు తమకు తెలియక చేసినట్టుగా, దర్శకులు- నిర్మాతలు ఒత్తిడి చేసి అలా చేయించారని, చిన్న వయసులో తమకు అది అర్థం కాలేదంటూ కూడా చెప్పారు. అలాగే తమ సెక్సీ పోజులు సినిమా స్టిల్స్ గా విడుదలైనప్పుడు..తమకు తెలియకుండా వాటిని విడుదల చేశారంటూ కూడా వాపోయినవారున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా