ప్రాజెక్ట్ కె…అంటే కర్ణ..? కృష్ణ?

ప్రభాస్ తో అయిదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. పైగా ఇటీవల…

ప్రభాస్ తో అయిదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. పైగా ఇటీవల ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తారని వార్తలు కూడా వినిపించాయి. 

రెండు భాగాలు కాదు..ఇదో సిరీస్ అని కూడా వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా మరి కొన్ని ఇంట్రస్టింగ్ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పురాణాల్లో కొంత మంది చిరంజీవులు వున్నారు. కొన్ని మంచి పాత్రలు వున్నాయి. వీటి ఆధారంగా ఫాంటసీ కథ అల్లుతూ ప్రాజెక్టు కె చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కర్ణ, కృష్ణ, కృపాచార్యుడు, ఇలాంటి పాత్రలను వర్తమానంలోకి తీసుకువచ్చే ఫాంటసీ కథలు ఏవో నాగ్ అశ్విన్ దగ్గర వున్నాయని, వీటి ఆధారంగా ఎనిమిది సినిమాలు వేరు వేరు హీరోలతో చేసే ఆలోచన నాగ్ అశ్విన్ లో వుందని టాక్. ఇప్పుడు తీస్తున్న సినిమాలో బ్రహ్మగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని కూడా అంటున్నారు.

మొత్తం మీద నాగ్ అశ్విన్ తనవి వైవిధ్యమైన ఆలోచనలు అని మరోసారి రుజవు చేసుకోబోతున్నారు. రాజమౌళి అయినా జానపద కథల నుంచి స్పూర్తి పొందారు తప్ప పూర్తిగా వైవిధ్యమైన, పూల్ ప్రూఫ్ కథలు అల్లలేదు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం తనలో మాంచి కథకుడు వున్నాడని, వాటిని తాను అద్భుతంగా విజువలైజ్ చేస్తానని రుజువు చేసుకోవడం పక్కా అనిపిస్తోంది.