దర్శకుడు పూరి జగన్నాధ్ తనను బెదిరిస్తున్నారంటూ తన పేరు ఎందుకు ఫిర్యాదులో చేర్చారో తనకు తెలియదని సినిమా ఫైనాస్షియర్, డిస్ట్రిబ్యూటర్ శోభన్ అన్నారు. పూరి జగన్నాధ్ పోలీసులకు వరంగల్ శ్రీను, శోభన్ ల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ‘గ్రేట్ ఆంధ్ర’ నేరుగా శోభన్ తో మాట్లాడింది.
తనకు ఈ విషయాలేవీ తెలియవని అంటూ కొన్ని పాయింట్లు చెప్పారు.
లైగర్ విడులయిన మర్నాటి నుంచి ఇప్పటి వరకు మా ఫోన్ లు ఆన్సర్ చేయడం మానేసారు. మరి అలాంటపుడు ఎలా బెదిరిస్తాము?
గతంలో పూరికి అవసరం అయినపుడల్లా నేను ఆదుకున్నాను. అది ఆయనకు తెలుసు. నిన్న మొన్నటి అడియో క్లిప్ లో కూడా నా గురించి మంచిగానే చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకిలా మాట మార్చారో తెలియదు.
వాట్సాప్ గ్రూపుల్లో ఇలా డిస్కషన్లు సాగుతున్నాయి అన్న సమాచారాన్ని మాత్రమే నేను పంపించాను. తప్ప నేనేమీ బెదిరించలేదు.
సినిమా వ్యాపారం చాలా గుట్టుగా సాగే వ్యవహారం. దానిని బజారుకు ఎక్కిస్తున్నారు.
కేసులె పెట్టుకుంటూ పోవాలి అంటే మా దగ్గర నిర్మాతల డిఫాల్ట్ చెక్కులు ఎన్నో వుంటాయి. కానీ సామరస్యంగా వ్యాపారం సాగించడమే మాకు అలవాటు.
మా టైమ్ బాలేదు..ఇలా జరిగింది అని అనుకుంటున్నా తప్ప, ఎవరినీ విమర్శించను.