టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ తెలంగాణ రాజకీయాలల్లో హైడ్రామా నడుస్తోంది. టీఆర్ఎస్ వైపు నుండి బీజేపీ ఈ కుట్ర వెనుక ఉందంటూ అరోపిస్తుంటే.. బీజేపీ నుండి మాత్రం ఈ ఫాంహౌస్ డ్రామా కేసీఆర్ నడిపిస్తున్నరంటూ విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ట్వీట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట ఐన కేసీఆర్ ఆడిన మరో నాటకమే “నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు”, అంటూ తెరాస నాయకుని ఫాం హౌస్ లో ఉన్న వారికి బీజేపీ సభ్యత్వం కేసీఆర్ ఇచ్చిండా? తెరాస పార్టీ ఇచ్చిందా?, ఈ నాటకంలో కేసీఆర్ పాత్ర లేదనుకుంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు.
మరో వైపు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఫాం హౌస్ దగ్గర దోరికిన వ్యక్తులకు, ఆ డబ్బులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, దానిపై ఎటువంటి విచారణకు అయిన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరి కొద్ది సేపులో ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.