పుష్ప-2 యూనిట్ బస్సుకు రోడ్డు యాక్సిడెంట్

మొన్నటికిమొన్న హరిహర వీరమల్లు సినిమా కోసం వేసిన సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సెట్ దాదాపు 50శాతం కాలిపోయింది. ఇప్పుడు పుష్ప-2 యూనిట్ ప్రమాదానికి గురైంది. యూనిట్ కు సంబంధించి కొంతమంది నటీనటులతో వెళ్తున్న…

మొన్నటికిమొన్న హరిహర వీరమల్లు సినిమా కోసం వేసిన సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సెట్ దాదాపు 50శాతం కాలిపోయింది. ఇప్పుడు పుష్ప-2 యూనిట్ ప్రమాదానికి గురైంది. యూనిట్ కు సంబంధించి కొంతమంది నటీనటులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.

పుష్ప-2 షూటింగ్ కోసం కొంతమంది ఆర్టిస్టులతో ప్రైవేట్ ట్రాలెల్స్ బస్సు బయల్దేరింది. నార్కట్ పల్లికి రాగానే, బస్సు అదుపుతప్పింది. పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పుష్ప-2 నటీనటుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంతమంది ఆర్టిస్టులున్నారు, వాళ్ల ఎవరు అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సులో 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోంది పుష్ప-2 సినిమా. ఈ మూవీకి సంబంధించి మొన్నటివరకు ఫహాద్ ఫాజిల్ పై భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఇప్పుడు మరో భారీ షెడ్యూల్ నడుస్తోంది. దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో భాగంగానే ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. గాయపడిన ఆర్టిస్టుల్ని స్థానిక హాస్పిటల్ లో తరలించారు. యాక్సిడెంట్ కారణంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.