Advertisement

Advertisement


Home > Movies - Movie News

కోటి రిస్క్ చేస్తే…కోట్లు

కోటి రిస్క్ చేస్తే…కోట్లు

సాహసమే చేయరా డింభకా అన్నాడు మాంత్రికుడు. కాస్త ఆను పాను చూసుకుని వస్తే రూపాయి..పోతే పావలా అనే ఫార్ములాతో ముందుకు వెళ్తే టాలీవుడ్ లో కాస్త డబ్బులు చేసుకునే అవకాశం వుంది. 2018 అనే సినిమాతో కొంతమంది కొత్త వాళ్లు ఇలాగే కాస్త డబ్బులు చేసుకున్నారు. ఎలా అంటే..

ఈ సినిమా మళయాళంలో పెద్ద సక్సెస్ అయింది. కానీ తెలుగు జనాలకు నచ్చుతుందా అన్నది అనుమానం. ఎందుకంటే 2018 వరదల బాధ అనుభవించిన వారు కేరళలో వున్నారు. అందుకే ఆ సినిమాకు వాళ్లు కనెక్ట్ అయ్యారు. కానీ మనవాళ్లు కనెక్ట్ అవుతారా? అందుకే చాలా మంది ఆ సినిమాకు దూరంగా వున్నారు.

ఇలాంటి టైమ్ లో గుడివాడకు చెందిన ఇద్దరు తెగించారు. నిర్మాత బన్నీ వాస్ ద్వారా 2018 ను జస్ట్ కోటి రూపాయల లోపు మొత్తానికి తెలుగు థియేటర్ హక్కులు తీసుకున్నారు. సిజి వర్క్ గట్రా ఏమీ లేదు. జస్ట్ డబ్బింగ్ అంతే. ప్రింట్ అండ్ పబ్లిసిటీ. ఈ ఖర్చును గీతా సంస్థ పెట్టి విడుద‌ల‌ చేసింది. ఇప్పుడు ఈ ఖర్చులు, ఆ కొన్న మొత్తం పోను మిగిలినది కొనుక్కున్న వాళ్లకు లాభం. గీతాకు విడుదల కమిషన్.

ఇప్పుటికి మూడు కోట్లకు పైగానే షేర్ వచ్చింది. స్టడీగానే వుంది. అంటే మరి పావలా పెడితే రూపాయి వచ్చినట్లేగా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?