Advertisement

Advertisement


Home > Movies - Movie News

జూన్ నుంచి నితిన్ కొత్త సినిమా

జూన్ నుంచి నితిన్ కొత్త సినిమా

హీరో నితిన్ కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఇది ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. భీష్మ లాంటి మాంచి సినిమా తీసిన వెంకీ కుడుమల డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించేది. ఈ సినిమా వర్క్ జూన్ అయిదు నుంచి మొదలవుతుంది. 

ఇప్పటికే వక్కంతం వంశీ డైరక్షన్ లో ఓ సినిమా షూట్ జరుగుతోంది. ఈ సినిమా షూట్ కు కూడా సమాంతరంగా డేట్ లు కేటాయిస్తారు.

వక్కంతం వంశీ సినిమా షూట్ కొంత వరకు జరిగింది. అయితే సెకండాఫ్ మీద మళ్లీ కాస్త రీ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. నితిన్ కు ఇష్టమైన రచయిత హర్షవర్ధన్ ఈ మేరకు వక్కంతం ఇచ్చిన స్క్రిప్ట్ ను ఫైన్ ట్యూన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూన్ తొలి రెండు వారాలు మైత్రీ-వెంకీ కుడుమల సినిమా మీద, మలి రెండు వారాలు వక్కంతం సినిమా మీద వర్క్ చేస్తారు నితిన్. వక్కంతం సినిమా పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ నుంచి దిల్ రాజు సినిమా వుంటుంది. దీనికి వేణు శ్రీరామ్ పని చేస్తారా? కొత్త దర్శకుడు పని చేస్తారా అన్నది ఇంకా తెలియాల్సి వుంది. 

అంధాదూన్ రీమేక్ కు ఆశించిన మేరకు ఫలితం రాకపోవడం, మాచర్ల నియోజకవర్గం సినిమా డిజాస్టర్ కావడంతో నితిన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?