Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప 2 ఫిక్స్.. ప్రాజెక్ట్.. దేవర సంగతేమిటి?

పుష్ప 2 ఫిక్స్.. ప్రాజెక్ట్.. దేవర సంగతేమిటి?

అల్లు అర్జున్ అనుకుంటే అది జరగాల్సిందే. అక్కడ సుకుమార్ వున్నారు. అంత త్వరగా తెమల్చరు అనే మాట వినపడడానికి లేదు. అనుకున్న డేట్ కు సినిమా రావాల్సిందే.

పుష్ప పార్ట్ వన్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు రెండో భాగం రాబోతోంది. ఆగస్ట్ 15 అని డేట్ ఇచ్చారు. గతంలో చాలా డేట్ లు అనుకున్నా, అధికారికంగా ప్రకటించిన డేట్ ఇదే. కానీ వస్తుందా, రాదా అన్న అనుమానాలు వుండనే వున్నాయి. కానీ ఆ అనుమానాలు అన్నీ పక్కన పెడుతూ టీజర్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను అందిస్తున్నట్లు నిర్మాతలు అయిన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో మరోసారి రిలీజ్ డేట్ ను పక్కాగా ప్రకటించారు. ఆగస్ట్ 15 విడుదల అంటూ.

ఏప్రియల్ లో ఫ్యామిలీ స్టార్ విడుదల వుంది. ఆ తరువాత మే 13 వరకు ఎన్నికలు వున్నాయి. మే 9న వస్తుందనుకున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే వచ్చే సూచనలు కనిపించడం లేదు. జూన్ నెల ఫరవాలేదు కానీ జూలై పెద్దగా ప్లస్ కాదు. అందువల్ల ప్రాజెక్ట్ కె డేట్ మీద అస్సలు క్లారిటీ లేదు ఇప్పటి వరకు.

ఎన్టీఆర్ దేవర సినిమా కూడా వుండనే వుంది. పుష్ప 2 రాకపోతే ఆ డేట్ వద్దామనే ఆలోచన దేవర మేకర్స్ లో వుంది. కానీ ఇప్పుడు అది కుదిరేది కాదు. అందువల్ల ఇక మిగిలింది దసరా డేట్ నే. కానీ ఈలోగా గేమ్ ఛేంజర్ డేట్ రాకుండా వుండాలి.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆగస్టు 15 డేట్ ను పుష్ప 2 వదులుకోవడం లేదు. ఈ డేట్ వదులుకుని తరువాత ప్రాజెక్ట కె, దేవర, గేమ్ ఛేంజర్ ల డేట్ లు చూసుకుంటూ కూర్చుంటే డిసెంబర్ లేదా జనవరి వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 పుష్ప 2 రిలీజ్ కు రెడీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?