Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిన్సియర్ పోలీసాఫీసర్ గా నాగార్జున

సిన్సియర్ పోలీసాఫీసర్ గా నాగార్జున

కుబేర సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈమధ్య దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ప్రకటించాడు. మూవీ నుంచి ఇప్పటికే హీరో ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజైంది, అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు నాగార్జున లుక్ విడుదల చేశారు.

కుబేర సినిమా నుంచి నాగ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ లుక్ లో నాగార్జున సింపుల్ అండ్ స్టయిలిష్ గా ఉన్నాడు. జోరుగా వర్షం కురుస్తుంటే.. ఓ కంటైనర్ నిండా ఉన్న డబ్బు దగ్గర నాగార్జున గర్వంగా నిల్చొనే సన్నివేశాన్ని ఫస్ట్ లుక్ వీడియోలో చూపించారు.

వర్షానికి ఒక కరెన్సీ నోటు తడిచి పాడైతే.. ఆ స్థానంలో తన సొంత డబ్బును పెట్టి తన నిజాయితీని చాటుకుంటాడు నాగ్. ఈ షాట్ లో శేఖర్ కమ్ముల స్టయిల్ కనిపించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ధనుష్, రష్మికపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే బ్యాంకాక్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?