పుష్ప 2 కి 3 కి మధ్య!

పుష్ప రెండో భాగానికి కొనసాగింపుగా మూడో పార్ట్ వుంటుందనే వార్తలు వచ్చిన తరువాత, వుండొచ్చనే హింట్‌ను హీరో బన్నీ ఇచ్చిన తరువాత ఫ్యాన్స్ లో ఓ పక్క ఆనందం ఓ పక్క అయోమయం. బన్నీని…

పుష్ప రెండో భాగానికి కొనసాగింపుగా మూడో పార్ట్ వుంటుందనే వార్తలు వచ్చిన తరువాత, వుండొచ్చనే హింట్‌ను హీరో బన్నీ ఇచ్చిన తరువాత ఫ్యాన్స్ లో ఓ పక్క ఆనందం ఓ పక్క అయోమయం. బన్నీని పాన్ ఇండియా హీరోని చేసిన పుప్ప సిరీస్ కొనసాగింపు అంటే మంచి విషయమే. అందువల్ల ఫ్యాన్స్ కు ఆనందమే.

కానీ 2021 లో పుష్ప వచ్చిన తరువాత మరో సినిమా రాలేదు అల్లు అర్జున్ నుంచి.  అదే పెద్ద టెన్షన్. పెద్ద పెద్ద దర్శకులు బన్నీ చుట్టూ తిరుగుతున్నారని వార్తలు వున్నాయి. కానీ ఎవరి సినిమా ఫైనల్ కాలేదు. పాన్ ఇండియా లెవెల్ భారీ యాక్షన్ ధ్రిల్లర్ లు తీస్తున్న దర్శకులతో తమ హీరో ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరిక.

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పుష్ప 2 కు కొనసాగింపు వుంటుందా? వుండదా? అన్నది ఇప్పుడే బయట పెట్టరని తెలుస్తోంది. పుష్ప 2 విడుదల టైమ్ లోనే ఆ విషయంలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అలాగే పుష్ప 2 తరువాత పుష్ప 3 చేసే లోగా వేరే పాన్ ఇండియా సినిమాను చేసే ఆలోచనలోనే బన్నీ వున్నారని తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఒకటే కండిషన్. బన్నీని మెప్పించే రెడీ మేడ్ స్క్రిప్ట్ ఎవరు తెస్తే వారికి చాన్స్ వుంటుంది. బన్నీతో భారీ సినిమా తీయాలనుకున్న త్రివిక్రమ్ కూడా దాని వర్క్ అలా వుంచి మరో యాక్షన్ ఎంటర్ టైనర్ ను బన్నీ కోసం తయారు చేసే పనిలో వున్నారని తెలుస్తోంది.

పుష్ప 2 కనుక డిసెంబర్ కు వెళ్లిపోతే, ఆ లోగా త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ ను రెడీ చేసేస్తారని వినిపిస్తోంది. మొత్తం మీద బన్నీ ఫ్యాన్స్ కోరిక రెండు విధాలుగా తీరుతుందన్నమాట. ఒకటి పుష్ప సిరీస్ కొనసాగింపు. మరొకటి మధ్యలో వేరే సినిమా చేయడం.