పుష్ప 2 కోసం కథామథనం

పుష్ప సినిమా బాలీవుడ్ లో ఓ లెవెల్ లో ఆడేసిన తరువాత పార్ట్ 2 కు కథ అల్లడం అంటే మామూలు విషయం కాదు. పుష్ప కు కొనసాగింపుగా పుష్ప 2 కథ ఇలా…

పుష్ప సినిమా బాలీవుడ్ లో ఓ లెవెల్ లో ఆడేసిన తరువాత పార్ట్ 2 కు కథ అల్లడం అంటే మామూలు విషయం కాదు. పుష్ప కు కొనసాగింపుగా పుష్ప 2 కథ ఇలా సాగుతుంది అని అనుకోవడం వరకు ఓకె. కానీ దాన్ని సన్నివేశాలతో ఫిల్ చేయడం అన్నది చాలా టఫ్ టాస్క్. 

ఎందుకంటే అందరి అంచనాలు ఓ లెవెల్ లో వున్నాయి ఆ పార్ట్ మీద. తొలిసగంలో, మలిసగంలో వాహ్..వా అనిపించే సీన్లు కొన్ని వుండాలి. కథను నడిపించే సీన్లు కూడా ఊహాతీతంగా వుండాలి.

అలాంటి సీన్ల కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కసరత్తు చేస్తున్నారట. దాదాపు నెల రోజులు ట్రైడంట్ హోటల్ లో కూర్చుని కథా చర్చలు సాగించారట. తనకు తెలిసిన యంగ్ రైటర్స్, క్రియేటివ్ పీపుల్ తో చర్చలు సాగించారట. అంతే కాదు, వాళ్లలో మంచి ప్లాట్ ను చెప్పిన వారికి, మంచి ఐడియా షేర్ చేసుకున్నవారికి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

సుకుమార్ కు ఓ అలవాటు వుంది. తన చుట్టూ వున్నావారు, కాస్త క్రియేటివ్ పీపుల్ అనుకున్నవారు అందరితో చర్చలు సాగిస్తారు. వాళ్ల దగ్గర నుంచి అవుట్ పుట్ తీసుకుంటారు. ఇవేవీ వాడరు కానీ వాటన్నింటి నుంచి మరో కొత్త అవుట్ పుట్ ఆలోచిస్తారు. 

అంటే పది ఐడియాలు తీసుకుని వాటి కలబోతగా పదకొండో ఐడియా తయారు చేసుకుంటారు. రైటర్ తో ఓ పాట రాయించాలంటే క్రియేటివ్ పీపుల్ తో డిస్కషన్లు సాగించి, వాళ్ల ఐడియాలు షేర్ చేసుకోమంటారు. వాటిలో బెస్ట్ అయిన వాటిని తాను సాంగ్ రైటర్ తో పంచుకుంటారు.

ఇప్పుడు పుష్ప 2 కూడా ఇలాంటి మధనమే సాగించారని, మంచి ఐడియాకు, మంచి సీన్ చెప్పిన వారికి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 కి అడిషన్స్ జరుగుతున్నాయి. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.