హీరో మహేష్ బాబుకు ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద ఆగ్రహం వచ్చిందని కొన్ని వారాల క్రితం వార్తలు వినిపించాయి. సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో వుండగానే ఎఫ్ 3 సినిమా రేట్లు తగ్గించి మరీ విడుదల చేయడం అన్న పాయింట్ ఇందుకు దారితీసిందని వివరణలు కూడా వినిపించాయి.
టాలీవుడ్ లో ఇవన్నీ కామన్. కొన్నాళ్లు వుంటాయి మళ్లీ కలిసిపోతారు. మైత్రీ మూవీస్ కు దిల్ రాజు కూడా ఇలాగే దూరం..దూరం అనుకున్నారు. ఉప్పెన నే ఆఖరు సినిమా అనుకున్నారు. కానీ మళ్లీ కలిసిపోయారు. ఎందుకంటే నైజాంలో దిల్ రాజు స్పీడ్ ను, ఆఫర్లను కొట్టే వారు లేరు. అంత ఇన్ ఫా స్ట్రక్చర్, పేమెంట్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ మిగిలిన వారిలో కష్టం.
ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారు కాబోయే మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజుకు ఇచ్చే చాన్స్ లు తక్కువ అని వినిపిస్తున్న గ్యాసిప్.
నిజానికి ఇదంతా మరో ఆరు నెలల తరువాత సంగతి. పైగా నిర్మాతలు అయిన హారిక హాసిని కి దిల్ రాజు తో గట్టి బంధాలు వున్నాయి. కానీ హీరో కనుక ఆసక్తిగా లేరు అని తెలిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు.
ప్రస్తుతానికి పరిస్థితి ఇలా వున్నా, అవసరం అయితే దిల్ రాజు ఓసారి వెళ్లి హీరోను కలిస్తే వ్యవహారం సెట్ అయిపోతుందని కూడా టాలీవుడ్ లో వినిపిస్తోంది. నైజాంలో సురేష్ బాబు, ఆసియన్ సునీల్ లాంటి బలమైన పంపిణీదారులు వున్నా, దిల్ రాజు మాదిరిగా దూకుడు వారిలో లేదు.
రిస్క్ అన్నది ఒక్క రూపాయి మేరకు కూడా వారు చేయలేరు. అదే దిల్ రాజు అడ్వాంటేజ్.