పుష్ప 2 డేట్ వచ్చేసింది

పుష్ప 2 విడుదల తేదీ వచ్చేసింది. పుష్ప వన్ వచ్చిన రెండున్నరేళ్లకు రెండో భాగం రాబోతోంది. 2021 డిసెంబర్ లో వచ్చింది పుష్ప సినిమా. 2024 ఆగస్ట్ 15 కు రాబోతోంది రెండో భాగం. …

పుష్ప 2 విడుదల తేదీ వచ్చేసింది. పుష్ప వన్ వచ్చిన రెండున్నరేళ్లకు రెండో భాగం రాబోతోంది. 2021 డిసెంబర్ లో వచ్చింది పుష్ప సినిమా. 2024 ఆగస్ట్ 15 కు రాబోతోంది రెండో భాగం. 

ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా క్రేజ్ వుంది. పైగా బన్నీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆగస్ట్ విడుదల అని ప్రకటించడం కాస్త విశేషమే. నిజానికి దర్శకుడు సుకుమార్ సినిమాలకు డెడ్ లైన్ పెట్టడం అన్నది అరుదుగా జరుగుతుంది.

పుష్ప 1 విషయంలో హీరో బన్నీ పట్టుపట్టి విడుదల డేట్ వేయించి, ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేయించి మరీ ఆ డేట్ కు వచ్చేలా చేసారు. మార్చి, ఏప్రిల్‌లో వస్తుందనుకున్న రెండో భాగాన్ని ఆగస్టు కు మార్చి మరీ డేట్ వేసారు. 

నిజానికి 2023 సమ్మర్ కే పుష్ప 2 వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు. డిసెంబర్ కి వస్తుందని ఆశించారు. కానీ ఆ జాడ కనిపించలేదు. ఇక 2024 సమ్మర్ అని అందరూ డిసైడ్ అయిపోయి వున్న వేళ ఆగస్టు అంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది.

అంటే దర్శకుడు సుకుమార్ కు చాలా లాంగ్ రోప్ ఇచ్చినట్లే. ఇక ఈ డేట్ కు కూడా సినిమాను రెడీ చేయకపోతే కష్టమే. పైగా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను బన్నీ చేయాల్సి వుంది. త్రివిక్రమ్ జనవరికి మహేష్ సినిమా నుంచి ఫ్రీ అయిపోతారు. అక్కడి నుంచి ఎనిమిది నెలలు బన్నీ కోసం వెయిటింగ్ లో వుండాలన్న మాట.