రిసార్ట్ కి రానంటున్న పుష్ప!

అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి సుకుమార్ ఎన్ని ప్లాన్స్ వేస్తున్నప్పటికీ ఏదీ వర్కవుట్ కావట్లేదు. తాజాగా ఓ రిసార్ట్ తీసుకొని అందులో షూటింగ్ చేద్దామని భావించాడు ఈ దర్శకుడు. కానీ…

అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి సుకుమార్ ఎన్ని ప్లాన్స్ వేస్తున్నప్పటికీ ఏదీ వర్కవుట్ కావట్లేదు. తాజాగా ఓ రిసార్ట్ తీసుకొని అందులో షూటింగ్ చేద్దామని భావించాడు ఈ దర్శకుడు. కానీ ఈ ప్రతిపాదనకు కూడా రెడ్ సిగ్నల్ పడింది.

ప్లేస్ ఏదైనా, ఇప్పటికిప్పుడు షూటింగ్ అంటే రిస్కే. అందుకే బన్నీ సింపుల్ గా నో చెప్పేశాడు. దీంతో సుకుమార్ రిసార్ట్ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. అంతేకాదు.. ఈ సందర్భంగా యూనిట్ కు మరో క్లారిటీ కూడా ఇచ్చాడు బన్నీ. తెలంగాణలో కేసుల సంఖ్య 200 లేదా 300కు వచ్చేవరకు షూటింగ్ స్టార్ట్ చేయొద్దని క్లియర్ గా చెప్పేశాడట.

ముందుగా “పుష్ప” షెడ్యూల్ ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు. కరోనా/లాక్ డౌన్ కారణంగా ఆ ప్లాన్ ను వదిలేసి.. హైదరాబాద్ కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని సెలక్ట్ చేశారు. అయినప్పటికీ సినిమా పట్టాలపైకి రాలేదు.

పోనీ అవుట్ డోర్ తో ఇబ్బంది అనుకుంటే.. ఇండోర్ లోనైనా షూట్ చేద్దామనే ఉద్దేశంతో రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మించారు. అక్కడ కూడా షూటింగ్ కు ససేమిరా అన్నాడు బన్నీ. దీంతో ప్రస్తుతానికి తన ప్లాన్స్ అన్నీ పక్కనపెట్టేశాడు సుకుమార్.

ఇంకా చెప్పాలంటే పుష్ప సినిమాను తాత్కాలికంగా పక్కనపెట్టి… ఓటీటీకి వెబ్ సిరీస్ అందించే పనిలో పడ్డాడు ఈ క్రియేటివ్ డైరక్టర్.

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే

జగనన్నని అడిగి నర్సాపురం సీటు తెచుకుంటా