పుష్ప షూట్ మళ్లీ వాయిదా

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించాల్సిన పుష్ప షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు ప్రారంభం కాకుండా అలా వుండిపోయింది.  Advertisement ఆఖరికి హీరోలు అందరూ…

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించాల్సిన పుష్ప షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు ప్రారంభం కాకుండా అలా వుండిపోయింది. 

ఆఖరికి హీరోలు అందరూ ధైర్యం చేసి బయటకు వస్తుండడంతో అన్ని సినిమాలు మొదలవుతున్నట్లుగానే, పుష్ప కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ నెల 5 నుంచి రంపచోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ ను ప్లాన్ చేసారు. 

వూడ్స్ రిసార్ట్, రాజమండ్రిలో కొన్ని హోటళ్లు బ్లాక్ చేసారు. కానీ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 లేదా 9 నుంచి పుష్ప షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుంది. 

అటవీ ప్రాంతంలో వేయాల్సిన సెట్ లు అవీ ఇంకా రెడీ కాకపోవడమే కారణం అని తెలుస్తోంది. ఈ సెట్ లు అవీ పూర్తి కావడానికి ఇంకా మరో నాలుగుయిదు రోజులు పడుతుందని బోగట్టా.

అందుకే షూటింగ్ ను 8 లేదా 9 నుంచి ప్రారంభిస్తారు. ఈ మేరకు స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ షెడ్యూల్ లోనే కొన్ని కీలక ఫైట్లు వున్నాయని తెలుస్తోంది. 

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్