Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప..హిట్ ఎందరికో అవసరం

పుష్ప..హిట్ ఎందరికో అవసరం

రాజ‌మౌళి లేకుండా వందల కోట్ల పాన్ ఇండియా సినిమా. రాజ‌మౌళి టచ్ చేయకుండా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన వైనం. రాజ‌మౌళి ప్లానింగ్ లేకుండా వందల కోట్ల సినిమా. అదీ పుష్ప. ఈ సినిమా మరో 17 రోఙుల్లో ప్రేక్షకుల మందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బోలెడు కంటెంట్ బయటకు వచ్చింది. శ్రీవల్లీ, సామీ పాటలు ఙనాల్లోకి బాగా వెళ్లాయి. బిడ్డా.అడ్డా పాటను జ‌నం పక్కన పెట్టారు. పులి..మేక సినిమా వరకే అని కామెంట్లు వున్నాయి. సినిమాలో రఫ్ లుక్ కాస్త ఎక్కువే కనిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా హిట్ అయి తీరాలి. ఆ అవసరం చాలా వుంది. ఎందుకుంటే రెండు భాగాలుగా తీయాలనుకున్న ఈ సినిమా రెండో భాగం తీయాలంటే తొలిభాగం హిట్ అయితేనే సాధ్యం. సుకుమార్ తను అనుకున్నట్లు రెండో భాగం వెంటనే తీసేందుకు హీరో ఓకె అనాలి అంటే తొలి భాగం బ్లాక్ బస్టర్ కావాలి. అదే విధంగా ఈ సినిమా డెఫిసిట్ తో విడుదలవుతోందని టాక్. ఎందుకంటే మలి భాగం ఫుటేఙ్ కూడా చాలా వరకు రెడీగా వుంది కనుక. బాహుబలి తొలి భాగం విషయంలోనూ అలాగే ఙరిగింది. పెట్టుబడి పూర్తిగా వెనక్కు రావాలంటే పుష్ప బ్లాక్ బస్టర్ కావాల్సిందే.

అల వైకుంఠపురములో తరువాత హీరో బన్నీ ఫుల్ జోష్ మీద వున్నారు. ఇండస్ట్రీ టాప్ హీరో అనిపించుకునే అవకాశం పుష్పతో వచ్చింది. పైగా పాన్ ఇండియా హీరోగా ఇది తొలిసినిమా. ఇది హిట్ అయితేనే పాన్ ఇండియా ప్రయత్నాలు కంటిన్యూ అవుతాయి. లేదంటే వేరే సంగతి. పైగా బన్నీ చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న సినిమా ఇది. గతంలో ఇలా ఆశలు పెంచుకుని, హడావుడి చేసిన ఆర్య2, నా పేరు సూర్య సినిమాలు ఆయన్ను పూర్తిగా నిరాశలో ముంచాయి. ఈసారి అలా కాకూడదు.

దర్శకుడు సుకుమార్ సంగతి. ఆయనకు పుష్ప వెంటనే చేతినిండా పని వుండాలి. సినిమా చేయాలి అంటే పుష్ప హిట్ ప్రాణావసరం. నిజానికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయనకు డేట్ లు ఇచ్చే పరిస్థితిలో ఏ పెద్ద హీరో లేరు. మహేష్, ఎన్టీఆర్, పవన్, మెగాస్టార్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా అందరూ వాళ్ల వాళ్ల లైనప్ లో ఫుల్ బిజిగా వున్నారు. రెండు మూడేళ్ల వరకు సుకుమార్ వైపు చూసే పరిస్థితి లేదు. అందువల్ల పుష్ప పార్ట్ 2 నే చేయాలి. అలా చేయాలంటే పార్ట్ వన్ హిట్ కావాల్సిందే.

అన్నింటికి మించి మైత్రీ మూవీస్ అధినేతలకు ఈ సినిమా హిట్ చాలా అవసరం.వాళ్ల చేతుల్లో చాలా సినిమాలు వున్నాయి. వందల కోట్ల టర్నోవర్ ఙరుగుతోంది. ఇలాంటి టైమ్ ఈ సినిమా నిరాశ పరిస్తే బ్యానర్ కు చాలా అంటే చాలా ఇబ్బంది. వెనుక వరుస సినిమాల మార్కెటింగ్ లకు ఇబ్బందులు రాకూడదు అంటే పుష్ప అద్నుతంగా పుష్పించాల్సిందే.

ఇవన్నీ ఇలా వుంచితే టాలీవుడ్ కు కూడా పుష్ప హిట్ అవసరం. సినిమాలకు ఫ్యామిలీలు రావడం లేదు. జ‌నాలు సరిగ్గా రావడం లేదు అన్న బాధ వుంది. అఖండ సినిమాతో పెద్ద సినిమాల దాడి ప్రారంభం అవుతోంది. అయితే బోయపాటి సినిమాకు ఫ్యామిలీలు ఏ మేరకు వస్తాయి అన్నది అనుమానం. అందువల్ల పుష్ప సినిమానే టెస్టింగ్ కిట్. ఈ సినిమాకు ఫ్యామిలీలు ఎంత ఎక్కువగా వస్తే మిగిలిన పెద్ద సినిమాలకు అంతకు అంతా భరోసా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?