పుష్ప..కేజిఎఫ్2 లను దాటేసింది

సర్కారు వారి పాట క్రేజ్ ఉత్తరాంధ్రలో క్లియర్ గా కనిపించింది. బన్నీ పుష్ఫ, యష్ కేజిఎఫ్2ల టోటల్ రన్ ను ఫస్ట్ వీకెండ్ లో దాటేస్తోంది.  Advertisement ఆ రెండు సినిమాలు ఉత్తరాంధ్రలో ఎనిమిది…

సర్కారు వారి పాట క్రేజ్ ఉత్తరాంధ్రలో క్లియర్ గా కనిపించింది. బన్నీ పుష్ఫ, యష్ కేజిఎఫ్2ల టోటల్ రన్ ను ఫస్ట్ వీకెండ్ లో దాటేస్తోంది. 

ఆ రెండు సినిమాలు ఉత్తరాంధ్రలో ఎనిమిది కోట్ల దాటలేకపోయాయి.. కానీ సర్కారు వారి పాట ఉత్తరాంధ్రలో తొలి నాలుగు రోజుల్లోనే ఎనిమిది కోట్ల షేర్ ను దాటేసింది.

తొలి రోజు 3.27 కోట్లు, మలి రోజు 1.54 కోట్లు, మూడో రోజు 1.55 కోట్లు వసూలు చేసింది. ఆదివారం స్ట్రాంగ్ గా వుంది చాలా అంటే చాలా హవుస్ పుల్స్ వచ్చాయి. అందువల్ల నాలుగు రోజుల కలెక్షన్లు ఎనిమిది కోట్లు దాటేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.

సినిమాను 12 కోట్లకు ఇచ్చారు. మరో నాలుగు కోట్ల షేర్ రావాల్సి వుంది. బ్రేక్ ఈవెన్ అన్న సమస్య రాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప, కేజిఎఫ్ 2 కి నార్మల్ రేట్లు కానీ సర్కారు వారి పాటకు యాభై రూపాయల అదనపు రేటు వచ్చింది.