Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప...వచ్చేసాడు

పుష్ప...వచ్చేసాడు

బన్నీ-సుకుమార్-మైత్రీ మూవీస్ ప్రాజెక్టుకు పుష్ప అనే పేరు పెడుతున్నారని నిన్న ఎక్స్ క్లూజివ్ గా, ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ను, దీంతో పాటు బన్నీ లుక్ ను విడుదల చేసారు.

పుష్ప సినిమా శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో కలప స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని ఇఫ్పటికే అన్ని మాధ్యమాల్లో వచ్చేసింది.  అందుకే సినిమాలో బన్నీ కాస్త రఫ్ లుక్ తో వుంటారని కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. చురకత్తులా వున్న చూపులతో, వత్తుయిన జుట్టుతో, కాస్త గుబురుగా పెరిగిన గడ్డంతో బన్నీ ఈ లుక్ లో కనిపిస్తున్నాయి. జుత్తు కూడా నల్లగా కాకుండా, మట్టిలో తిరిగి తిరిగి ఎర్రబడిన లుక్ వుంది. టైటిల్ లో రోడ్లమీద వాహనాలు విపరీతంగా తిరిగితే పడే ముద్రలను ఇంపోజ్ చేసారు. 

మళ్లీ మరో లుక్

ఇదిలా వుంటే కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా, మరో స్టిల్ కూడా ఇవ్వాలని 'పుష్ప' యూనిట్ భావిస్తోంది. ఫస్ట్ లుక్ ఇచ్చిన కొంత టైమ్ తరువాత ఈ రోజే మరో స్టిల్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ లుక్ స్టిల్ కేవలం సినిమా కు సంబంధించింది. తరువాత ఇచ్చే స్టిల్ ఫ్యాన్స్ కోసం అని తెలుస్తోంది.

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?