Advertisement

Advertisement


Home > Politics - Gossip

మిగులన్నదీ వారే..అప్పులన్నదీ వారే

మిగులన్నదీ వారే..అప్పులన్నదీ వారే

నోరా, తాటిమట్టా అని మన జనాలు అంటుంటారు. ఇష్టం వచ్చినట్లు మాటలు మార్చి మార్చి మాట్లాడేవారిని చూసి. తెలుగునాట వళ్లంతా పసుపు రంగు పూసేసుకుని నాట్యం చేసే ఓ వర్గం వెబ్ మీడియా, ప్రింట్ మీడియా వ్యవహారం ఇలాగే వుంది. మొన్నటికి మొన్న ఆంధ్రలో జీతాలు యాభై శాతం కట్ చేసి, తరువాత ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కరోనా కల్లోలం నేపథ్యంలో రెవెన్యూ వుండదు కాబట్టి అలా చేయడం సబబే అని తలచి ఉద్యోగులు కూడా సైలంట్ గా వున్నారు.

కానీ ఈ సామాజికవర్గ మీడియా మాత్రం, కథలు అల్లడం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇన్ని డబ్బులు వున్నాయి. అన్ని వున్నాయి. అయినా జీతాలు కోత పెట్టడం ఏమిటి అంటూ సణుగుళ్లు ప్రారంభించింది. చిత్రమేమిటంటే ఇదే మీడియా గతంలో రాష్ట్రప్రభుత్వం దివాలా తీస్తోందని, ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంచేస్తున్నారని విపరీతడంగా వార్తలు వండి వార్చింది. 

ఇదిలా వుంటే డబ్బులున్నా జీతాలు ఇవ్వలేదు అన్న కథనాలు జనం పట్టించుకోలేదు. కరోనా ప్రభావం, వాస్తవ పరిస్థితి వారికి తెలుసు. అందుకే తమ పన్నాగం పారలేదని తెలుసుకున్న ఈ సామాజిక మీడియా మళ్లీ వెనక్కు వెళ్లి రాష్ట్రం అప్పుల్లో కూరుకుందంటూ వార్తలు వండడం మొదలుపెట్టింది.

ఇవన్నీ చూస్తుంటే ఇక ఈ మీడియా కబుర్లు ఇలాగే సాగుతాయని జనం అనుకునే పరిస్థితి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే రాతలు రాస్తూ వుంటారు. జనం చూసి పక్కన పడేస్తారు. 

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?