ఆర్ సి 15 కు సెట్ బ్యాక్

తమిళ టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కు చిన్న సెట్ బ్యాక్ తప్పలేదు. ఈ సినిమాలో జీ సినిమాస్ కూడా భాగస్వామి. చాలా…

తమిళ టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కు చిన్న సెట్ బ్యాక్ తప్పలేదు. ఈ సినిమాలో జీ సినిమాస్ కూడా భాగస్వామి. చాలా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే విశాఖ..ఈస్ట్ గోదావరి, అమృత్ సర్, ఇలా చాలా చోట్ల షూట్ చేసారు. శంకర్ దర్శకత్వం అంటే మామూలుగా వుండదు. చకచక షూటింగ్ నడవదు. సీన్లను శిల్పాలు చెక్కినట్లు చెక్కి, పెర్ ఫెక్షన్ కోసం చూస్తారు. పైగా ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే శంకర్ ఈ సారి కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద కన్నా సహజమైన సెట్ ల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు.

రోబో సినిమాకు ముందు శంకర్ సినిమాలో పాటలు అంటే సెట్ లు చాలా భారీగా వుండేవి. జెంటిల్ మేన్ నుంచి వరుసగా చూసుకుంటూ వస్తే ఇది అర్థం అవుతుంది. అసలే శంకర్ – రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా. దానికి తోడు భారీ సెట్ లు. ఇంకా..ఇంకా..దీంతో ఖర్చు బాగా పెరిగిపోతోందని బోగట్టా. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుకు-ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా సాగుతున్న ఈ బేధాప్రాయాలు పెరిగి, ఆర్ట్ డైరక్టర్ ను మార్చే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎప్పడు మారుస్తున్నారు..లేదా ఇప్పటికే మార్చేసారా? అన్నది తెలియాల్సి వుంది. అంటే మళ్లీ కొత్త ఆర్ట్ డైరక్టర్ అంటే దర్శకుడు శంకర్ తో సింక్ కావాలి. అన్నీ సెట్ కావాలి. అందువల్ల ఆర్ సి 15 కు మరి కాస్త ఆలస్యం తప్పదేమో?