Advertisement

Advertisement


Home > Movies - Movie News

మొన్న సైజ్ జీరో.. ఇప్పుడు కిక్ బాక్సింగ్

మొన్న సైజ్ జీరో.. ఇప్పుడు కిక్ బాక్సింగ్

మొన్నటికిమొన్న సైజ్ జీరో బాడీ సొంతం చేసుకుంది రాశిఖన్నా. తొలిసారి బికినీ వేసుకొని గోవాలో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. ఇప్పుడీ బ్యూటీ మరో కొత్త డ్యూటీ చేపట్టింది. ఈసారి కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది ఈ చిన్నది.

ఉన్నఫలంగా రాశిఖన్నా ఇలా కిక్ బాక్సింగ్ వైపు ఎందుకు మళ్లింది? ఆమె తన కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతోందా? లేక ఎక్సర్ సైజుల్లో భాగంగానే కిక్ బాక్సింగ్ ను ఎంచుకుందా? ఈ విషయం మాత్రం సీక్రెట్ అంటోంది రాశి.

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన సన్నీ అనే సినిమా చేస్తోంది రాశిఖన్నా. ఈ పాత్ర కోసం ఫిట్ గా కనిపించాలి. అందుకే కిక్ బాక్సింగ్ ను ఎంచుకున్నానని తెలిపిన ఈ హీరోయిన్.. సినిమాలో తన పాత్రకు కిక్ బాక్సింగ్ కు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు.

ప్రస్తుతం తను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నానంటున్న రాశిఖన్నా.. ఇప్పుడు మెంటల్లీ ఫిట్ గా ఉండే అంశంపై దృష్టి సారించబోతున్నట్టు ప్రకటించింది. అంటే ఇకపై వ్యాయామాలతో పాటు త్వరలోనే యోగా లాంటివి కూడా ఈమె స్టార్ట్ చేయబోతోందన్నమాట.

వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు. పూర్తిగా తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఓ తెలుగు సినిమా ఆఫర్ ఉందని లాక్ డౌన్ టైమ్ లో చెప్పిన ఈ చిన్నది.. ఇప్పటివరకు దాన్ని బయటపెట్టలేదు.

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే‌

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?