తవ్వే కొద్దీ బయటపడుతున్న ‘స్మృతి’ లీలలు

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ గా తననుతాను పరిచయం చేసుకొని కోట్ల రూపాయలు బురిడీ కొట్టించిన కేసులో స్మృతి సిన్హా అలియాస్ శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో…

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ గా తననుతాను పరిచయం చేసుకొని కోట్ల రూపాయలు బురిడీ కొట్టించిన కేసులో స్మృతి సిన్హా అలియాస్ శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో శిరీష చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు. రోజుకు లక్ష రూపాయలు ఖర్చు చేసే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిందట శిరీష అలియాస్ స్మృతి.

హైదరాబాద్ లోని ఓ సెవెన్ స్టార్ హోటల్ లో స్పెషల్ సూట్ రూమ్ ఉంది. దాని అద్దె రోజుకు 50వేలు. ఇతర ఖర్చులు మరో 50వేలు. అంటే రోజుకు అక్షరాలా లక్ష రూపాయలన్నమాట. అలాంటి ఖరీదైన సూట్ రూమ్ లో 40 రోజుల పాటు ఎంజాయ్ చేసి, 40 లక్షల రూపాయల బిల్లు చెల్లించింది శిరీష. ఆమె ఈ విషయాలు చెబుతుంటే పోలీసులు నోరెళ్లబెట్టారు.

కేవలం ఇది ఓ కోణం మాత్రమే. ఆమె విలాసవంతమైన జీవితం అడుగడుగునా కనిపిస్తుంది. కనీసం 4 నెలలకు ఒక ఖరీదైన కారు కొనేవారు. పుట్టినరోజు వేడుకలు వస్తే 30 లక్షలకు తగ్గకుండా బంగారం కొనేవారు. పటాన్ చెరులో విల్లా కొనుగోలు కోసం స్పాట్ లో 70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు.

ఇలా రిచ్ లైఫ్ ను చూపించి వీరారెడ్డిని మోసం చేశారు శిరీష, విజయ్ కుమార్ రెడ్డి. అతడి నుంచి ఏకంగా 11 కోట్ల 50 లక్షలు కొట్టేశారు. వీటిలో దాదాపు 80శాతం మొత్తాన్ని కేవలం తమ విలాసాలకే వాడుకున్నారు. ఎప్పుడైతే విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. శిరీష అలియాస్ స్మృతితో పాటు విజయకుమార్ రెడ్డి బంధువులు నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్ని, శిరీష చేసిన పూర్తి మోసాలకు సంబంధించిన మరిన్ని వివరాల్ని ఈరోజు పోలీసులు  బయటపెట్టబోతున్నారు.

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే‌

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా