Advertisement

Advertisement


Home > Movies - Movie News

'రాధాకృష్ణ' అంటే 'ది గ్రేట్ జ‌ర్న‌లిస్ట్' సారేనా!

'రాధాకృష్ణ' అంటే 'ది గ్రేట్ జ‌ర్న‌లిస్ట్' సారేనా!

ఏంటో రోజుకొక సినిమా వ‌స్తుండ‌టంతో క‌థ‌లు క‌రువ‌య్యాయి. తీసిన వాటిలోనే క‌థ‌ను కాస్త ఇటూ అటూ మార్చి తెర‌కెక్కిస్తుండ‌టం తెలిసిందే. తాజాగా దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. గ‌త ఏడాది ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ అని రాంగోపాల్ వ‌ర్మ సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు ల‌క్ష్మీపార్వ‌తినే ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ‘రాధాకృష్ణ’ అనే పేరుతో సినిమా తీస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశమైంది.

రాధాకృష్ణ అంటే మ‌న ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ, ది గ్రేట్ జ‌ర్న‌లిస్ట్ వేమూరి రాధాకృష్ణ గురించేనా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌డంలో ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిస్టుగా 1995లో ఆర్‌కే పోషించిన పాత్ర చిన్న‌దేమీ కాదు. మ‌నోడు అప్ప‌టికే తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడ‌నే టాక్ ఉంది క‌దా! అప్ప‌ట్లో రాధాకృష్ణ‌పై ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌ధాన పాత్ర అని చెప్ప‌డం, సినిమా పేరు ‘రాధాకృష్ణ’ కావ‌డం, అందులోనూ ఆ పేరుతో ప్ర‌స్తుతానికి ఆ జ‌ర్న‌లిస్టు మ‌హానుభావుడు ఒక్క‌డే పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీ కావ‌డంతో అంద‌రి దృష్టి ఆయ‌న‌పై మ‌ళ్లింది. ఎక్క‌డైనా హీరోయిజం పాత్ర‌కు సినిమా పేరు పెడ‌తారు. మ‌రి ‘రాధాకృష్ణ’ అంటే...ఎన్టీఆర్ - ల‌క్ష్మీపార్వ‌తి ఎపిసోడ్‌లో మ‌న జ‌ర్న‌లిస్ట్ సార్ విల‌న్ పాత్ర క‌దా పోషించింది. మ‌రి ఆర్‌కే గురించి సినిమా అయితే , టైటిల్ పేరు ఎందుకు పెడ‌తార‌బ్బా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

అయితే ఒక్క‌టి మాత్రం నిజం. మ‌న రాధాకృష్ణ సార్ గురించి క‌నీసం రెండుమూడు సినిమాలు తీసేమైన క‌థ ఉంది. కనుమరుగవుతున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమ కథను చూపించబోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే మ‌న ఆర్‌కే సార్ గురించి మాత్రం కాదంటారా? ఏమో మ‌న ఆర్‌కే సార్ జీవితంలో కూడా ప్రేమ క‌థ‌లు ఉండ‌వా? ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే అనే ప్రోగ్రాంలో ఆయ‌న ఎదుటి వాళ్ల‌ను గుచ్చి గుచ్చి అడిగేది ప్రేమ‌, పెళ్లి...ఎట్సెట్రా గురించే క‌దా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?