రాధేశ్యామ్ సినిమా విడుదల ఫిక్సయింది. ఒక్కో అప్ డేట్ బయటకు వస్తోంది. ప్రభాస్-పూఙా హెగ్డే నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సంక్రాంతికి విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి సినిమా ఫస్ట్ కాపీ చూసినట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ పూఙా హెగ్డే ఫ్యామిలీ కూడా సినిమా చూసారని తెలుస్తోంది.
సినిమా చాలా బాగా వచ్చిందని ప్రభాస్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తోంది. ఓ మంచి ప్రేమ కథను అందంగా తెరపైకి తెచ్చారని టీమ్ అంతా భావించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సముద్రంలో తీసిన 12 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే కీలకంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే సలార్ ఎలాగూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా వుంటుందని, ఈ లోగా వచ్చే రాధేశ్యామ్ లో ఫన్, రొమాన్స్, లవ్ కలిసి మాంచి ఫీల్ ఇచ్చే సినిమాగా తయారయిందని, ప్రభాస్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
రాధాకృష్ణ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. మరో పాట రాబోతోంది.