సినిమాల మంచి చెడ్డల సంగతి ఎలా వున్నా, సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువ వుంటుంది. ఫ్యాన్స్ వార్ ల సంగతి చెప్పనక్కరలేదు. దీనికి తోడు రాజకీయ పార్టీల ప్రమేయ కూడా జోడయితే ఇక చెప్పనక్కరలేదు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడయితే జనసేన పార్టీని ప్రారంభించారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు వ్యతిరేకమయింది. ఇది క్లారిటీగా తెలిసిపోతోంది. అలాగే మిగిలిన హీరోలకు కూడా ఏదో ఒక లాజిక్ లాగి. ఏదో ఒక పార్టీ కి ముడేయడం జరిగిపోతోంది.
ఆ విధంగా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు వైకాపా అనుకూలం అనే వాదన మొదలయింది. పైగా భీమ్లా టైమ్ లో టికెట్ ల జీవో ఇవ్వకుండా, ఇప్పుడు ఇచ్చారు. ఈ లాజిక్ చాలు కదా. అందుకే ఇప్పుడు రాధేశ్యామ్ కు నెగిటివిటీ స్ఫ్రెడ్ చేయడానికి రంగం సిద్దం అయిపోయందని తెలుస్తోంది.
భీమ్లా నాయక్ కు నెగిటివిటీ చేసిన వారికీ రాధేశ్యామ్ కు నెగిటివిటీ చేయాలనుకుంటున్న వారికీ డైరెక్ట్ వైరం లేదు. ఈ రెండింటి మధ్య వైకాపా వుంది. అంతే. శతృవు మిత్రుడు తమకు శతృవు అనే లాజిక్ తో తెరవెనుక పావులు కదుపుతున్నారు.
ముఖ్యంగా వైకాపాను బలంగా వ్యతిరేకించే వర్గం ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకుందని తెలుస్తోంది. రాధేశ్యామ్ వ్యతిరేక ప్రచారాన్ని తెరవెనుక స్మూత్ గా ప్రోత్సహిస్తున్నారు. ఏ పాయింట్ల మీద ఎలా ప్రచారం చేయాలో చెబుతున్నారట.
మొత్తం మీద వాళ్లు..వాళ్లు బాగానే వుంటారు. మధ్యలో సినిమాలు బలవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇవన్నీ ఇందుకోసమే ఉపయోగపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.