ప్రభాస్-పూజాహెగ్డే.. ఈ కెమిస్ట్రీ వేరే లెవెల్

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది రాధేశ్యామ్ సినిమా. వచ్చే నెల థియేటర్లలోకి కూడా రాబోతోంది. ఇదొక అందమైన ప్రేమకథ. అది కూడా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే వింటేజ్ లవ్ స్టోరీ.…

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది రాధేశ్యామ్ సినిమా. వచ్చే నెల థియేటర్లలోకి కూడా రాబోతోంది. ఇదొక అందమైన ప్రేమకథ. అది కూడా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే వింటేజ్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ప్రభాస్-పూజాహెగ్డే మధ్య లవ్ సీన్స్ చాలా బాగుంటాయని, యూనిట్ చాన్నాళ్లుగా చెప్పుకొస్తోంది. 

సినిమా వాళ్లది కాబట్టి ఆమాత్రం చెప్పుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. కానీ ఈరోజు రిలీజైన సాంగ్ చూస్తే మాత్రం అది నిజమేనేమో అనిపిస్తుంది. ప్రభాస్-పూజాహెగ్డే మధ్య తీసిన ఓ మాంటేజ్ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు. 'ఈ రాతలే' అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ఆడియో పరంగా ఇప్పటికే పెద్ద హిట్టయింది. 

ఇప్పుడు వీడియోతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ప్రభాస్, పూజాహెగ్డే ఒకరికొకరు పరిచయం కాకముందే వచ్చే సన్నివేశాలతో తీసిన ఈ మాంటేజ్ సాంగ్.. ఎంతో రిచ్ గా ఉంది. విజువల్స్ చూడగానే ఆకట్టుకుంటున్నాయి. పాట చూసిన ఎవరికైనా ఓ అందమైన అనుభూతి కలుగుతుంది.

ఈ సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు, గ్రాఫిక్స్ ఉపయోగించారు. అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదొక మాంటేజ్ సాంగ్ అని, ఇంత తొందరగా వీడియో క్లిప్స్ చూపిస్తే సినిమాలో కొంత కథ తెలిసిపోతుందని అప్పుడే వెల్లడించాం. ఇప్పుడు సరిగ్గా విడుదలకు 2 వారాల ముందు ఆ పాట వీడియోను విడుదల చేశారు. అయితే ఇదే పాటలో రివీల్ అవ్వాల్సిన కీలకమైన ఓ సన్నివేశాన్ని మాత్రం చాకచక్యంగా సాంగ్ లో కట్ చేశారు. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక ప్రేరణ అనే డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు. వాళ్ల ప్రేమ, ప్రకృతిని ఎదిరింది ఎలా నిలిచిందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.