Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎంపీ సీటుపై కన్నేసిన సీనియర్ నటి

ఎంపీ సీటుపై కన్నేసిన సీనియర్ నటి

సీనియర్ నటి రాధిక ఈసారి ఎంపీ సీటుపై కన్నేశారు. దీని కోసం ఆమె ఏకంగా తన పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా, విరుధునగర్ సెగ్మెంట్ నుంచి రాధిక బరిలో దిగబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

రాధికకు రాజకీయాలు కొత్త కాదు. ఎప్పుడైతే ఆమె శరత్ కుమార్ ను పెళ్లాడిందో అప్పట్నుంచే ఆమె రాజకీయాలు మొదలయ్యాయి. ముందుగా శరత్ కుమార్ విషయానికొద్దాం. ప్రారంభంలో ఈయన డీఎంకే కూటమిలో ఉన్నారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. 2007లో సొంతంగా పార్టీ పెట్టారు. 

అప్పటికే రాధికకు, శరత్ కుమార్ కు పెళ్లయి ఆరేళ్లయింది. అప్పట్నుంచే భర్తతో కలిసి వివిధ పార్టీల్లోకి మారుతూ, ఆ తర్వాత సొంత పార్టీలో ఉపాధ్యక్షురాలి హోదాలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి మద్దతిచ్చిన రాధిక.. లోక్ సభ ఎన్నికల వేళ తన పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేశారు. అనుకున్నట్టుగానే ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు.

రాధికకు ఈ సీటు అంత తేలిగ్గా రాలేదు. విరుదునగర్ నుంచి స్వయంగా బీజేపీ పోటీ చేయాలని ఓ దశలో భావించింది. దీనికి కారణం దివంగత నేత విజయ్ కాంత్ కు చెందిన డీఎండేకే పార్టీతో పొత్తులు విఫలమవ్వడమే. సరిగ్గా అప్పుడే సీన్ లోకి వచ్చిన రాధిక-శరత్ కుమార్.. తమ పార్టీని బీజేపీలో విలీనం చేసి, బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 

61 ఏళ్ల రాధిక వినోద రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భాషల్లో సినిమాలు చేశారు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. కాలంతో పాటు మారుతూ ఓటీటీలో కూడా తన ప్రతిభను చాటుతున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని ఆశపడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?