దేవుడు చేసిన ‘రఘు కుంచె’

ఇండస్ట్రీలో సీనియర్ సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో రఘు కుంచె కూడా ఒకడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా సంగీత దర్శకుల్లో సీనియర్ ఇతడు. తనకు ఎందుకు అవకాశాలు రావట్లేదో, తన కెరీర్…

ఇండస్ట్రీలో సీనియర్ సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో రఘు కుంచె కూడా ఒకడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా సంగీత దర్శకుల్లో సీనియర్ ఇతడు. తనకు ఎందుకు అవకాశాలు రావట్లేదో, తన కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు ఈ సంగీత దర్శకుడు.

“రవితేజతో దేవుడు చేసిన మనుషులు సినిమా నా కెరీర్ ను పడేసింది. ఆ సినిమాకు మంచి పాటలిచ్చాను. అన్ని పాటలు బాగుంటాయి. కానీ సినిమా ఫ్లాప్ అయింది. అదే సినిమా హిట్టయి ఉంటే ఈరోజు మరో రేంజ్ లో ఉండేవాడ్ని. ఈపాటికి రవితేజ 2 సినిమాలు, పూరి జగన్నాధ్ 2 సినిమాలు, నిర్మాత భోగవల్లి ప్రసాద్ మరో 2 సినిమాలు ఇచ్చేవారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కెరీర్ డల్ అయింది.”

దేవుడు చేసిన మనుషులు సినిమాకు ఏకంగా 50లక్షల పారితోషికం అందుకున్నానని, కానీ అందులో పెద్దగా మిగుల్చుకోలేదంటున్నాడు రఘు. టాప్ సింగర్స్ తో పాడించానని, పెద్ద ఎక్విప్ మెంట్ కొన్నానని చెప్పుకొచ్చాడు. అలా శక్తివంచన లేకుండా కష్టపడినా దేవుడు తనను చూడలేదంటున్నాడు. టాలెంట్ తో సంబంధం లేకుండా, ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన వాడికే విలువ అంటున్నాడు.

రీసెంట్ గా పలాస సినిమాలో నటించాడు రఘు కుంచె. అతడి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయినప్పటికీ తను మ్యూజిక్ డైరక్షన్ వైపే ఉంటానంటున్నాడు. సంగీతమనే సముద్రంలో ఈదుతూనే ఉంటానంటున్నాడు. నిజంగా నటుడిగా ఎదగాలనుకుంటే తన కోసం ప్రతి సినిమాలో పూరి ఓ పాత్ర రాసేవాడని చెప్పుకొచ్చాడు రఘు కుంచె.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్