బిగ్ బాస్ జోడీ రాహుల్, పునర్నవి మరోసారి తమ సంబంధాన్ని బయటపెట్టారు. తమ మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టంచేశారు. తాము ప్రేమికులం కాదని, అలా అని వేర్వేరుగా ఉండలేమని, కలిసే ఉంటామని అంటోంది ఈ జంట. ఇద్దరూ కలిసి జంటగా ఓ టీవీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితంలో జరిగిన ఓ బాధాకరమైన ఘటనను బయటపెట్టంది పునర్నవి. తన కాలేజ్ డేస్ లో ఓ వ్యక్తి తన వెంట పడ్డాడని, కానీ అతడి ప్రేమ తనకు అర్థం కాలేదంటోంది. తనకు అతడి ప్రేమ అర్థమయ్యేసరికి, శ్రీలంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో అతడు చనిపోయాడని చెప్పుకొచ్చింది.
అటు రాహుల్ కూడా బిగ్ బాస్ డేస్ లో జరిగిన ఓ బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. హౌజ్ లో ఉన్న టైమ్ లో రాహుల్ తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. కానీ ఎక్కడ రాహుల్ తన గేమ్ ను చెడగొట్టుకుంటాడో అనే భయంతో ఆ విషయాన్ని హౌజ్ లో ఉన్న రాహుల్ కు చెప్పలేదట. ఈ విషయం తెలిసి చాలా బాధాపడ్డానన్నాడు రాహుల్.
ఇక హౌజ్ లో బాగా ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పమంటే పునర్నవి పేరు చెప్పాడు రాహుల్. అటు పున్నూ కూడా రాహుల్ పేరు చెప్పింది. తామిద్దరం చాలా చాలా క్లోజ్ గా ఉంటామని, కానీ లవర్స్ మాత్రం కాదని అంటోంది ఈ జంట.