Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాహుల్ రామకృష్ణ..మళ్లీ మరోసారి

రాహుల్ రామకృష్ణ..మళ్లీ మరోసారి

నటుడు రాహుల్ రామకృష్ణ భలే చిత్రమైన మనిషి. వున్నట్లుండి ఎప్పుడో ఓక సారి ట్విట్టర్ లో చటుక్కున మెరుపులు మెరిపిస్తాడు. అంతా ఉరుము లేని పిడుగు టైపు. దానికి ముందు ఏమీ వుండదు. వెనుక ఏమి వుండదు. ఎంత సడెన్ గా వస్తుందో…అంత సడెన్ గానూ మాయమవుతుంది. కానీ ఒకటి రెండు రోజులు హడావుడి మాత్రం తప్పదు. గతంలో ఒకటి రెండు సార్లు ట్విట్టర్ లో రాహుల్ రామకృష్ణ కామెంట్ ల నేపథ్యంలో ఇలా జరిగింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

ఇంతకీ రాహుల్ రామకృష్ణ ఏమన్నాడు..అంటే..

I wish Hyderabad had the best pedestrian paths

I wish we had the best traffic discipline

I really wish people committing traffic violations aren’t let off so easily

I wish Hyderabad isn’t about Hindu vs. Muslim

I wish we conserved our lakes and parks and all natural ecology around our living breathing surroundings

I wish life is fair for all of us, fair being a standard of equity i our social relations.

I wish hate,as an emotion, never existed.

నిజానికి వీటిల్లో పెద్దగా అభ్యంతరకరమైనవి ఏవీ లేవు. కానీ హిందూ ముస్లిం అంటూ వేసిన లైన్ ఒక్కటే కాస్త కాంట్రావర్సీకి దారి తీసేదిగా వుంది. మిగిలనవన్నీ జనాలకు సుద్దులు చెప్పేవే. కానీ పది మంచి మాటలు కాదు..ఒక్క నెగిటివ్ వర్డ్ నే సోషల్ మీడియాకు కావాలి. దాంట్లోంచే రంధ్రాన్వేషణ మొదలవుతుంది.

దాంతో మెలమెల్లగా రాహుల్ రామకృష్ణ కు నెగిటివ్ కామెంట్లు ఎదురుకావడం మొదలైంది. ఈ కామెంట్లు ఇంకా శృతి మించకుండానే తన లాయర్లు తన పరువుకు నష్టం కలిగించేవారి సంగతి చూసుకుంటారనే విధమైన మరో ట్వీట్ ను రాహుల్ వేయడం విశేషం.

అసలే ఈ నెలలోనే తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధమైన వార్తలు ప్రచారంలోకి రావడం, వాటికి ఖండనలు రావడం జరిగిపోయింది. ఇప్పుడు ఇలాంటి ట్వీట్ అనగానే తెరాస లేదా భాజపా మద్దతు దారులు ఎవరి యాంగిల్ లో వారు చూసి, సమాధానం చెప్పడం మొదలైంది. సున్నితమైన అంశం కనుక, సున్నితమైన సమాధానాలు చెప్పినంత వరకు ఫరవాలేదు. శృతి మించితేనే సమస్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?