చిరంజీవి బోర్ కొట్టరు.. పవన్ ఎవ్వరితో కలవరు

కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని చూసిన వ్యక్తి, అందరికీ ఆప్తుడుగా కొనసాగుతున్న వ్యక్తి.. చిరంజీవి-పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి వ్యక్తే రాజారవీంద్ర. ఇలాంటి వ్యక్తి చిరంజీవి,…

కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని చూసిన వ్యక్తి, అందరికీ ఆప్తుడుగా కొనసాగుతున్న వ్యక్తి.. చిరంజీవి-పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి వ్యక్తే రాజారవీంద్ర. ఇలాంటి వ్యక్తి చిరంజీవి, పవన్ కల్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

“చిరంజీవి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫ్రీ టైమ్ దొరికితే మనం కాలక్షేపం చేస్తాం. కానీ ఆయన మాత్రం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి నిమిషం చిరంజీవి గారితో కొత్తగా ఉంటుంది. నేను ఆయనతో 10 ఏళ్లు ట్రావెల్ చేశాను. నాకు ఏ రోజూ, ఏ నిమిషం ఆయనతో బోర్ కొట్టలేదు. చిరంజీవితో ఉంటే ఆరోజు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నా కెరీర్ లో నేను చాలామందిని కలిశాను కానీ చిరంజీవి గారితో ఉన్నప్పుడు కలిగే ఎగ్జైట్ మెంట్ ఎవరి దగ్గర కలగలేదు. ఆయన జ్ఞాపకశక్తికి చేతులెత్తి దండం పెట్టొచ్చు.”

ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ..  పవన్ ను తను చాలా సార్లు కలిశానని, కానీ ఆయనతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదని చెబుతున్నాడు రాజా రవీంద్ర. పవన్ చాలా కొద్దిమందితో మాత్రమే మాట్లాడతారని, మితభాషి అని అంటున్నాడు.

“టోటల్ గా కల్యాణ్ వేరు. ఎవ్వరితో ఆయన్ను పోల్చలేం. డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇంట్లో ఉంటే మొక్కలకు ఆయనే నీళ్లు పోస్తారు. ఆధ్యాత్మికంగా చాలా డీప్ గా ఉంటారు. పవన్ లో పైకి కనిపించే వ్యక్తి వేరు, లోపల వేరు. ఆయన చాలా డివోషనల్. ఆయన చదివినన్ని పుస్తకాలు మరే హీరో చదివి ఉండడు.”

పవన్ మంచి వ్యక్తి, నిస్వార్థపరుడే అయినప్పటికీ.. జనం ఆయన్ను ఏ కోణంలో చూస్తున్నారనేది ఇంపార్టెంట్ అంటున్నాడు రాజా రవీంద్ర. సినిమా ప్రేక్షకుడు వేరు, ఓటేసేవాడు వేరని.. ఇద్దరి మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నాడు.