చంద్రబాబు దగ్గరకు వెళ్తే కరోనా?

విశాఖలో ఏం జరిగినా రాజకీయం చేయాలని చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ లో రెడీగా ఉంటారన్నది తెలిసిందే. డాక్టర్ సుధాకర్ తో మొదలుపెట్టి, ఎల్జీ పాలిమార్స్,  పరిశ్రమలలో ప్రమాదాలు, సునామీలు, హుదూదులు ఇలా చాలానే  టీడీపీ…

విశాఖలో ఏం జరిగినా రాజకీయం చేయాలని చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ లో రెడీగా ఉంటారన్నది తెలిసిందే. డాక్టర్ సుధాకర్ తో మొదలుపెట్టి, ఎల్జీ పాలిమార్స్,  పరిశ్రమలలో ప్రమాదాలు, సునామీలు, హుదూదులు ఇలా చాలానే  టీడీపీ పచ్చ ట్విట్టర్ లో కనిపిస్తూనే ఉంటాయి. 

తాజాగా టీడీపీ అభిమాని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు  నలందా కిషోర్ హఠాత్తుగా చనిపోయారు. మరి ఆయన మరణం ‌ మీద కూడా ట్వీట్లేస్తూ  పెదబాబు, చినబాబు దిగజారుడు రాజకీయమే చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక తాజాగా నలందా కిషోర్ మరణాన్ని కూడా విడిచిపెట్టకుండా బాబు, లోకేష్ అది కరోనా మరణం అంటున్నారు. సీఐడీ పోలీసులు కిషోర్ని కర్నూలు తీసుకెళ్ళి విచారించారని, అక్కడే కరోనా అంటించారని బాబు అండ్ సన్ వైసీపీ మీద చేస్తున్న ఘాటు విమర్శలు.

అయితే దీని మీద వైసీపీ రివర్స్ అటాక్ చేసింది. నలందా కిషోర్ ని చంద్రబాబు తన దగ్గరకు పిలిపించుకుని అప్పట్లో ఆయన ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా  రాజకీయం చేయబోయారని, అలా బాబు దగ్గరకు వెళ్లిన అయిదుగురిలో ముగ్గురికి కరోనా వచ్చిందని వైసీపీ విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ  తాజాగా ఆరోపిస్తున్నారు.

కిషోర్ చావుకు కరోనావే కారణమైతే అది  బాబు అంటించినదని ఆయన చెబుతున్నారు. మరి బాబు దగ్గరకు వెళ్ళివచ్చిన అయిదుగురిలో కరోనా అంటిన ఆ ఇద్దరూ ఎవరో చూడాలి. అంతే కాదు, బాబు తాను సేఫ్ జోన్లో ఉన్నానని ఇప్పటిదాకా  అనుకుంటున్నారు కదా. మరి బాబుని కలిసే ప్రయత్నంలో దూరాభార ప్రయాణాల వల్ల కరోనా వచ్చిందా. లేక బాబు ఇంటి గన్ మేన్ల వల్ల కరోనా వచ్చిందా. ఇది తేలాల్సిన విషయమే. 

ఏది ఏమైనా రాజకీయ కరోనా మాత్రం బాబు చినబాబు వల్లనే ఏపీలో బాగా వ్యాపించింది అన్నది వైసీపీ నేతలు అంటున్న మరో మాట.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు

కాపీ పేస్టులు చేసేవాళ్ళు కూడా రివ్యూ రైటర్లు అయిపోయారు