రాజ‌మౌళి అంటే మండుతోంది

సోషల్ మీడియాను ఫాలో అయ్యే నందమూరి ఫ్యాన్స్ కు ఈ విషయం బాగా తెలుసు. ఆర్ఆర్ఆర్ తరువాత పైకి చెప్పకున్నా, ట్విట్టర్ లో ట్వీట్ ల పరంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలను చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్…

సోషల్ మీడియాను ఫాలో అయ్యే నందమూరి ఫ్యాన్స్ కు ఈ విషయం బాగా తెలుసు. ఆర్ఆర్ఆర్ తరువాత పైకి చెప్పకున్నా, ట్విట్టర్ లో ట్వీట్ ల పరంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలను చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజ‌మౌళి అంటే మండుతోంది.ఇది వాస్తవం. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ పాత్ర హైలైట్ కావడం, ఎన్టీఆర్ కు సరైన క్యారెక్టర్ పడలేదని భావించడంతో ఫ్యాన్స్ మండి పడుతూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పీక్ లో వున్న టైమ్ లో అంతంత మాత్రంగా బయటకు వచ్చింది ఈ అసంతృప్తి. ఆ తరువాత నుంచి అలా అలా పెరుగుతూనే వుంది.

నిన్నటికి నిన్న ఆచార్య ఫంక్షన్ లో రాజ‌మౌళి మళ్లీ మరోసారి ఈ గాయాన్ని రేపింది. రామ్ చరణ్ సెల్ఫ్ మేడ్ అంటూ పొగుడుతూ చేసిన ప్రసంగం, నచ్చడం లేదు. చిరు బ్యాకింగ్ తో వచ్చిన రామ్ చరణ్ ను సెల్ఫ్ మేడ్ అనడం ఏమిటి అంటూ ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు. ఇదంతా కమ్యూనిటీతో సంబంధం లేని ఫ్యాన్స్ వ్యవహారం. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ ను తమవాడిగా ఫీలయ్యే ఓ సామాజిక వర్గం కూడా అసంతృప్తిగానే వుంది. తమ వర్గంలో ఐకానిక్ ఫిగర్స్ కొందరు వుంటారు. అలాంటి వారిని ఓన్ చేసుకుంటారు. వాళ్లకు ఏం తక్కువ కాకూదని కోరుకుంటారు. ఆ సామాజిక వర్గం అలా ఐకానిక్ ఫిగర్ గా భావించే వాళ్లలో ఎన్టీఆర్ ఒకరు. వాళ్లు కూడా రాజ‌మౌళి చేసినది బాగాలేదని ఆంతరింగక చర్చల్లో చెప్పుకుంటున్నారు. చెప్పుకుని బాధపడుతున్నారు.

ఆ వర్గానికి చెందిన ఓ పెద్దాయిన ఇలా అన్నారు…’’ ఫ్యాన్స్ ఫీల్ కావడం వేరు. మా వర్గంలోని క్రీమీ లేయ‌ర్ కు కూడా తారక్ అంటే ఓ అభిమానం వుంది. అలాంటి తారక్ ఇమేజ్ పెంచేది పోయి, చరణ్ ఇమేజ్ పెరిగేలా సినిమా చేయడం, నాలుగేళ్ల తారక్ సమయాన్ని వృధా చేయడం మా వాళ్లకు నచ్చడం లేదు…’’ అన్నారు. రాజ‌మౌళి మీద మాకు ఎంత గౌరవం, అభిమానం వున్నా ఈ విషయంలో మాత్రం ఆయన్ని సపోర్ట్ చేయలేకపోతున్నాం అని అన్నారు.

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ చరణ్ మాత్రం శంకర్ సినిమా షూట్, ఆచార్య సినిమా ప్రమోషన్ రెండింటినీ సమానంగా వాడేసుకుంటూ తన ఇమేజ్ ను మరింతగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు.