రాజమౌళి పొలిటికల్ గా టార్గెట్ అవుతున్నాడా?

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏ క్షణాన ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేశాడో అప్పట్నుంచి మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు రాజమౌళి. బాహబలి టైమ్ నుంచి ఇలాంటి కాంట్రవర్సీస్ చూస్తున్నాడు రాజమౌళి. అయితే ఈసారి…

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏ క్షణాన ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేశాడో అప్పట్నుంచి మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు రాజమౌళి. బాహబలి టైమ్ నుంచి ఇలాంటి కాంట్రవర్సీస్ చూస్తున్నాడు రాజమౌళి. అయితే ఈసారి ఆ వివాదాలు పొలిటికల్ టర్న్ తీసుకోవడమే ఇతడికి ఇబ్బందికరంగా మారింది.

టీజర్ లో కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ ను ముస్లిం యువకుడి గెటప్ లో చూపించంపై ఆదివాసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. కొమరం భీమ్ మనవడు కూడా అభ్యంతరం వ్యక్తంచేశాడు. 

ఇక్కడివరకు ఓకే. కానీ ఇదే వివాదాన్ని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ మరింత రాజేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ టీజర్ పై నిప్పులు చెరిగారు. చూస్తుంటే.. ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

కొమరంభీమ్ ను అనుచితంగా చూపిస్తూ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తే సినిమాను అడుగడుగునా అడ్డుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. సినిమా రీళ్లను తగలబెడతామన్నారు. 

హిందూ మతాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బీజేపీ కార్యకర్తలు రాజమౌళి ఆస్తుల్ని ధ్వంసం చేస్తారంటూ హెచ్చరించారు. నిజానికి ఇప్పుడు రీళ్లు లేకపోయినా తన ఆవేశంను చూపించేందుకు సంజయ్ ఇలా పడికట్టు పదాలు వాడేశారు.

బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు, కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించడం కాసేపు తప్పే అనుకుందాం. దానికి ఇలా వీరావేశంతో హెచ్చరికలు జారీచేయడం, దాడి చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్. ఎందుకు అలా చూపించాల్సి వచ్చిందంటూ వివరణ కోరడం సమంజసం.

ఎందుకంటే, ఈ సినిమా పూర్తిగా ఫిక్షన్ అని రాజమౌళి ఆది నుంచి చెబుతూ వస్తున్నాడు. బహుశా ఓ సన్నివేశం కోసమో, లేక సినిమాలో ఓ చిన్న ట్విస్ట్ కోసమో రాజమౌళి ఈ పని చేసి ఉండొచ్చు. సినిమా మొత్తం కొమరం భీమ్ ను ముస్లింగా చూపించడం తప్పు. 

మేకింగ్ ప్రీడమ్ ను ఉపయోగించుకొని ఏదో ఒక చిన్న సన్నివేశంలో అలా చూపించడంలో తప్పులేదు. దీనిపై రాజమౌళి వివరణ ఇచ్చేంతవరకు ఎదురు చూడడం కరెక్ట్. జక్కన్న వివరణ విన్న తర్వాత అప్పుడు రాజకీయ నాయకులెవరైనా స్పందిస్తే బాగుంటుంది.

అలా అని ఈ విషయంలో పూర్తిగా రాజమౌళిని కూడా వెనకేసుకు రాలేం. ఎందుకంటే, ఓ వైపు ఇంత వివాదం చెలరేగుతుంటే… తెలిసి కూడా ఇన్ని రోజులు ఏమీ ఎరగనట్టు, ఇంకేమీ జరగనట్టు రాజమౌళి సైలెంట్ గా ఉండడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని తెగేదాకా లాగకుండా.. రాజమౌళి దీనిపై ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది.

సినిమా ఎంత వివాదాస్పదమైతే అంత మంచిది అనుకునే రోజులివి. అయితే చాలామంది మేకర్స్ లా రాజమౌళి కూడా అదే ఫీలింగ్ లో ఉంటాడని అనుకోలేం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. కాబట్టి ఈ వివాదానికి ఇక్కడితో రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టడమే అన్ని విధాలుగా మంచిది. 

రోనా తగ్గకపోయినా.. నిమ్మగడ్డ తగ్గట్లేదు