టాలీవుడ్ లో ఏం కర్మ..ప్రపంచంలోనే సహజీవన సంస్కృతి పెరుగుతోంది. గతంలో అయితే ఇలాంటి సంబంధాలకు వేరే పిచ్చి పిచ్చి పేర్లు వుండేవి.
కానీ ఇప్పుడు సింపుల్ గా లివింగ్ టుగెదర్ రిలేషన్ అని ఓ మాట అనేస్తే చాలు. టాలీవుడ్ లో తెలిసినవి, తెలియని ఇలా చాలా వున్నాయి.
అలాంటి వాటిలో ఓ డైరక్టర్ ఓ హీరోయిన్ లివింగ్ టుగెదర్ వైనం ఒకటంట. ఈ డైరక్టర్ ఓ సినిమా చేసారు. చాలా బాలారిష్టాలు దాటుకుని విడుదలై, బాగానే ఆడింది అనిపించుకుంది.
ఆ సినిమాలోనే నటించిందీ నార్త్ ఇండియన్ అమ్మడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ స్నేహం చిగురించిందట. ఆ స్నేహం సహజీవనమై నేటికీ అలా కొనసాగుతోందని బోగట్టా.
లేటెస్ట్ గా మరో సినిమా చేయబోతున్నారు ఆ డైరక్టర్. అందులో ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వుంటారని టాక్. అయినా కూడా ఈ అమ్మాయికి మాత్రం చాన్స్ ఇవ్వడం లేదట. అలా అని ఆ అమ్మాయి నటించడం మానేయలేదు.
ఆ మద్య ఓ సినిమా చేసింది, చాలా అందంగా తయారైందీ అమ్మాయి అని కాంప్లిమెంట్ కూడా అందుకుంది. మరి తన సినిమాలో డైరక్టర్ ఎందుకు చాన్స్ ఇవ్వడం లేదో?