Advertisement

Advertisement


Home > Movies - Movie News

కొమరం భీమ్ ను కెలికిన రాజమౌళి

కొమరం భీమ్ ను కెలికిన రాజమౌళి

రామరాజు ఫర్ భీమ్ అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రాజమౌళి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ టీజర్ పై చాలా విమర్శలు పడుతున్నాయి. స్టాక్ షాట్స్ వాడి టీజర్ కట్ చేశారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో రిఫరెన్స్ లు చూపిస్తూ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు జనం. ఇప్పుడు వీటికి తోడు మరికొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు రాజమౌళి.

టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై విమర్శలు చెలరేగాయి. కొమరం భీమ్.. నిజాం పాలనకి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన కూతుర్ని అప్పటి ముస్లిం పాలకులు కొంతమంది ఇబ్బంది పెట్టారని చారిత్రక ఆధారాలున్నాయి. అలాంటి చరిత్ర ఉన్న భీమ్ ని టీజర్ చివర్లో ముస్లిం గెటప్ లో చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా తన ట్విట్టర్లో రాజమౌళిని సున్నితంగా హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించొద్దని, ఇలా చేసే బాలీవుడ్ తన విశ్వసనీయతను కోల్పోయిందని గుర్తు చేశారు.

ఇలాంటి కామెంట్స్ వస్తాయని తెలిసే.. ఇది పూర్తిగా కల్పిత గాథ అని రాజమౌళి ఇటీవల జనాల్లోకి గట్టి మెసేజ్ పంపించాడు. అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్ కి, కొమరం భీమ్ కి సంబంధం లేనప్పుడు ఆయన పేరు ఎందుకు వాడుకోవాలి, సరిగ్గా ఆయన జయంతి రోజే టీజర్ ఎందుకు విడుదల చేయాలి.

కల్పిత పాత్రలు, కల్పిత గాథ అని చెప్పుకుంటే.. రామ్ గోపాల్ వర్మలాగా పేర్లను తెలివిగా మార్చేసుకోవాలి. ఇక్కడ మాత్రం చరిత్రకు సంబంధించిన పేర్లు పెట్టేసి, ఇది కల్పితం అనుకోండి అంటే ప్రజలు ఊరుకోరు. కొమరం పులి సినిమా టైమ్ లోనే ఆ ఇంటిపేరు వాడుకోవడంపై పెద్ద రచ్చ జరిగింది, ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ కి కొమరం భీమ్ అనే పేరు పెట్టి, ముస్లిం గెటప్ వేయిస్తే ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.

మరోవైపు టీజర్ కి అతిపెద్ద మైనస్ రామ్ చరణ్ వాయిస్ అని తేల్చేశారు నెటిజన్లు. ఆడు కనపడితే.. అంటూ ఎన్టీఆర్, రామరాజు కోసం చెప్పిన మాటలు వింటే వెంటనే రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. కానీ భీమ్ కోసం రామ్ చరణ్ చెప్పిన మాటలు తేలిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు.

జెండా పొగరు అంటూ పవన్ కల్యాణ్ పాత డైలాగులే రిపీటయ్యాయి కానీ పస లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో భీమ్ ఫర్ రామరాజు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో రామరాజు ఫర్ భీమ్ టీజర్ ని ఎడిట్ చేసి పెట్టిన ఫ్యాన్ మేడ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అసలు టీజర్ కంటే దీనికే ఎక్కువ లైకులు, షేర్లు వెళ్తున్నాయి. 

అవి.. ఎవ‌రి ఆశ‌ల పునాదులో చెప్ప‌వేం ఈనాడూ!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?