కరోనా నుంచి బయటపడిన రాజమౌళి

తనకు కరోనా సోకిందంటూ కొన్ని రోజుల కిందట బాంబ్ పేల్చాడు దర్శకుడు రాజమౌళి. తను వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నానని, తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోమంటూ ప్రకటించాడు. అలా…

తనకు కరోనా సోకిందంటూ కొన్ని రోజుల కిందట బాంబ్ పేల్చాడు దర్శకుడు రాజమౌళి. తను వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నానని, తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోమంటూ ప్రకటించాడు. అలా కుటుంబంతో పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన రాజమౌళి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

“2 వారాల క్వారంటైన్ పూర్తయింది. ఎలాంటి లక్షణాలు లేవు. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్ వచ్చింది.”

ఇలా తనకు కరోనా తగ్గిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు ఈ దర్శకుడు. తనకు కరోనా సోకిందని ప్రకటించిన రోజునే.. తగ్గిన వెంటనే ప్లాస్మా డొనేట్ చేస్తానని చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని గుర్తుచేశాడు. శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందడానికి మరో 3 వారాల టైమ్ పడుతుందని వైద్యులు చెప్పారట.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమాను పూర్తిచేయడమే రాజమౌళి ముందున్న మొదటి టార్గెట్. ఈ సినిమా తర్వాత మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ డైరక్టర్.

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

పవన్ కళ్యాణ్ చదివినన్ని బుక్స్ ఏ హీరో చదవలేదు