రంగస్థలం రిపీట్స్.. బయటపెట్టిన జక్కన్న

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా రిలీజైన తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు. లిస్ట్ లో గౌతమ్ తిన్ననూరి…

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా రిలీజైన తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు. లిస్ట్ లో గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా ఉంది. అయితే ఈ సినిమాలతో పాటు చరణ్ లిస్ట్ లో సుకుమార్ మూవీ కూడా ఉంది.

అవును.. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి బయటపెట్టడం విశేషం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి.

త్వరలోనే సుకుమార్, రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని.. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసని రాజమౌళి బయటపెట్టాడు. తను చూసిన, విన్న బెస్ట్ ఓపెనింగ్ సీన్స్ లో ఒకటిగా అది నిలిచిపోతుందని చెబుతున్నాడు జక్కన్న.

రంగస్థలంలో 'సౌండ్ ఇంజినీర్' చిట్టిబాబుగా చరణ్ ను ప్రజెంట్ చేశాడు సుకుమార్. రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా అది నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి చరణ్ ను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు సుక్కూ.

అయితే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే సుక్కూ ముందుగా పుష్ప-2 పూర్తిచేయాలి. ఇటు చరణ్ కూడా కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది.