మెగా రాయబారం మరి లేనట్లే

సినిమా రంగం సమస్యల విషయంలో మెగాస్టార్ ప్లాన్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ఆయన ఒకసారి సినిమా వాళ్లందరని తన ఇంట్లో సమావేశ పర్చి, దానికి తనకు నచ్చిన వాళ్లను మాత్రం పిలిచి, త్రివిక్రమ్ లాంటి…

సినిమా రంగం సమస్యల విషయంలో మెగాస్టార్ ప్లాన్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ఆయన ఒకసారి సినిమా వాళ్లందరని తన ఇంట్లో సమావేశ పర్చి, దానికి తనకు నచ్చిన వాళ్లను మాత్రం పిలిచి, త్రివిక్రమ్ లాంటి వాళ్లను వదిలేసి ఏదేదో చేసారు. ఆ తరువాత సైలంట్ అయ్యారు. టికెట్ ల సమస్య ముదిరన తరువాత ఇటీవల తాను మళ్లీ లైన్ లోకి వచ్చారు. సిఎమ్ ను కలవబోతున్నట్లు, దానికి మంత్రి పేర్ని నాని ద్వారా రాయబారం పంపినట్లు ఆయన పీఆర్ టీమ్ మీడియాకు లీకులు ఇచ్చి హడావుడి చేసారు.

కానీ దానికి స్పందన ఏమీ కనిపించలేదు. పైగా మంత్రి పేర్ని నాని నేరుగా మీడియా ముందు ఈ రోజు మాట్లాడబోతున్నారు. ఇండస్ట్రీ కి చెందిన నిర్మాతలు, దర్శకులు, ఎగ్ఙిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఓ కమిటీ వేయబోతున్నారు. వైజాగ్ వీరునాయుడు, ఒంగోలు బాబు, యువి వంశీ, బోగవిల్లి బాపినీడు, డైరక్టర్ మహీ వంటి వారి పేర్లు ఈ కమిటీలో వుండే అవకాశం వుందని వినిపిస్తోంది.

వీరెవరు మెగా క్యాంప్ జ‌నాలు కాదు. కమిటీ వేసిన తరువాత ఇక సంప్రదింపులకు మెగాస్టార్ వెళ్లే అవకాశం లేదా పిలిచే అవకాశం లేకపోవచ్చు. కమిటీ ద్వారానే ఇక సంప్రదింపులు, సలహాలు జ‌రుగుతాయి. రేట్లు కాస్త అటు ఇటు సవరించి పండగ లోపు అనౌన్స్ చేసే అవకాశం వుంది. దాంతో టికెట్ ల కథ ముగిసిపోతుంది.

ఇండస్ట్రీలో మా ఎన్నికల సమయంలో కూడా మెగాస్టార్ తెరవెనుక చక్రం తిప్పారని వార్తలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ ను ఆయనే ముందుకు తెచ్చారని వినిపించింది. కానీ ఇండస్ట్రీ లో ఓ వర్గం మొత్తం పట్టుదలగా మంచు విష్ణు ప్యానెల్ ను గెలిపించింది. మెగా ప్యానల్ అని ముద్ర పడిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఓడించింది. అప్పటి నుంచి మెగాస్టార్ మౌనంగానే వుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతారు, సిఎమ్ ను కలుస్తారు అని ఫీలర్లు వదిలిన తరువాత ఇదిగో, ఇలా జ‌రిగింది.